COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco X6 Pro 5G Price: చైనీస్ టెక్ కంపెనీ పోకో తన Poco X6 లైనప్‌ను గత వారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సిరీస్ లు Poco X6, Poco X6 Pro మోడల్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మొబైల్స్ అతి తక్కువ ధరలోనే ప్రీమియం సెగ్మెంట్లో లభించనున్నాయి. అయితే మొదటగా ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ కంపెనీ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ మొబైల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం.


ధర, డిస్కౌంట్ వివరాలు..
ప్రస్తుతం ఈ ఫ్లిప్కార్ట్ లో పోకో 8GB + 256GB వేరియంట్ కూడిన Poco X6 స్మార్ట్ ఫోన్ ను అందుబాటులో తీసుకురాబోతోంది. అలాగే Poco X6 Pro యొక్క 8GB + 256GB వేరియంట్‌ను రూ. 24,999 ధరతో.. 12GB + 512GB వేరియంట్‌ను రూ. 26,999 మొదటి సేల్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ మొబైల్స్ పై బ్యాంక్ ఆఫర్స్ ని కూడా అందిస్తోంది. 


ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో బిల్ చెల్లిస్తే  రెండు మోడళ్లపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ నువ్వు వినియోగిస్తే దాదాపు రూ.2,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అలాగే భారీ తగ్గింపుతో ఈ స్మార్ట్ ఫోన్స్ పొందవచ్చు. 


Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..


మొబైల్ పూర్తి వివరాలు..
Poco X6 శక్తివంతమైన Qualcomm Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 1.5K రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది.


Poco X6 సిరీస్ స్పెసిఫికేషన్‌లు:
✿ 6.67-అంగుళాల 1.5K పోలెడ్ డిస్‌ప్లే
✿ డిస్ప్లేపై గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ
✿ 5000mAh కెపాసిటీ
✿ IP54 రేటింగ్ 
✿ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
✿ 64MP ప్రైమరీ కెమెరా
✿ 8MP అల్ట్రా-వైడ్ కెమెరా
✿ 2MP మాక్రో సెన్సార్‌ కెమెరా
✿ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MIUI 14


Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter