Realme 10 pro: కళ్లు చెదిరే కెమేరా, బ్యాటరీ బ్యాకప్‌తో లాంచ్ అయిన రియల్ మి 10 ప్రో సిరీస్ , ధర ఎంతంటే
Realme 10 pro: రియల్ మి 10 ప్రో సిరీస్ ఇండియాలో లాంచ్ అయింది. అద్భుతమైన 108 మెగాపిక్సెల్ కెమేరా ఈ ఫోన్ సొంతం. రియల్ మి 10 ప్రో, రియల్ మి 10 ప్రో ప్లస్ ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి.
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియాలో రియల్ మి 10 ప్రో సిరీస్ లాంచ్ అయిపోయింది. ఈ సిరీస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కళ్లు చెదిరే కెమేరా, బ్యాటరీ బ్యాకప్ ఈ ఫోన్ సొంతం. ఈ ఫోన్ ఇతర ప్రత్యేకతలు, ధర ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
రియల్ మి 10 ప్రో రెండు స్టోరేజ్ వేరియంట్లతో వస్తోంది. ఇందులో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. వీటి ధర 18,999 రూపాయలు, 19,999 రూపాయలున్నాయి. రియల్ మి 10 ప్రో ప్లస్ మూడు వేరియంట్లలో ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. వీటి ధర వరుసగా 24,999 రూపాయలు 25, 999 రూపాయలు, 27,999 రూపాయలుగా ఉంది. ఈ రెండు వేరియంట్లు మూడు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. రియల్ మి 10 ప్రో ప్లస్ ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. అటు రియల్ మి 10 ప్రో అయితే డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది.
రియల్ మి 10 ప్రో ప్రత్యేకతలు
రియల్ మి 10 ప్రోలో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడీ డిస్‌ప్లే లభిస్తుంది. ఇది కాకుండా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్ఓసితో నడుస్తుంది. కెమేరాపరంగా చూస్తే డ్యూయల్ కెమేరా ఉంటుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ వైడ్‌లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. 33 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇందులో 3.5 ఎంఎం హెడ్‌పోన్ జాక్, డ్యూయల్ స్పీకర్స్ , సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరో ప్రత్యేకత.
రియల్ మి 10 ప్రో ప్లస్ ప్రత్యేకతలు
రియల్ మి 10 ప్రోలో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడీ డిస్‌ప్లే లభిస్తుంది. ఇది కాకుండా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్‌తో నడుస్తుంది. కెమేరాపరంగా చూస్తే డ్యూయల్ కెమేరా ఉంటుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ వైడ్ లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంది.67 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
Also read: PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు షాక్.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook