Realme 12 Pro: అదిరిపోయే Realme 12 Pro మొబైల్ రాబోతోంది..దీని కెమెరాపై ఏ యాపిల్ ఫోన్ కెమెరా పనికి రాదు!
Realme 12 Pro Launch Update: అతి తక్కువ ధరలోనే మార్కెట్‌లోకి రియల్ మీ మరో సిరీస్‌తో కూడిన మొబైల్స్‌ను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరలోనే లభించనున్నాయి. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Realme 12 Pro Launch: ప్రముఖ చైనీస్ కంపెనీ రియల్ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ కంపెనీ మార్కెట్‌లోకి మరో శక్తివంతమైన స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను Realme 12 Pro మోడల్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైన్‌ను జనవరి చివరి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ టిప్‌స్టర్ తెలిపారు. లాంచింగ్‌కి ముందే ఈ మొబైల్స్‌కి సంబంధించి ఫీచర్స్, ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ Realme 12 Pro మోడల్ ఇటీవలై చైనాలో లాంచ్ చేసిన Realme GT 5 ప్రోని పోలి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ అనేక రకాల కొత్త ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ Realme 12 Pro స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన కెమెరా కాన్ఫిగరేషన్‌తో రాబోతోందని తెలిస్తోంది. ఈ సిరీస్ మొత్తం మూడు వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఇప్పటికే ఈ మూడు మోడల్స్‌ను కంపెనీ లాస్ వెగాస్‌లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మొబైల్‌లో లాప్ ఎండ్ వేరియంట్ Realme 12 Pro Plus మోడల్‌లో విడుదల చేయాలని యోచిస్తోంది.
ఈ మొబైల్స్ టాప్ వేరియంట్‌లో 120X జూమ్ అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు సోనీ IMX890 సెన్సార్‌తో పాటు పెరిస్కోప్ పోర్ట్రెయిట్ కెమెరా సెన్సార్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్స్ Qualcomm ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే కంపెనీ ఇటీవలే ఈ మొబైల్స్ సంబంధించిన కొన్ని ఫీచర్స్‌ను మాత్రమే ప్రకటించింది. వీటికి సంబంధించి పూర్తి సమాచారం అతి త్వరలోనే విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
లీకైన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్..
ఈ Realme 12 Pro స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో రాబోతోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UIపై రన్ అవుతుంది. ఇది Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 50MP ప్రధాన లెన్స్‌తో పాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరాతో రాబోతోంది. ఈ కెమెరాలు OIS కూడా సపోర్ట్ చేస్తాయి. అలాగే ఈ మొబైల్ 32MP సెల్ఫీ కెమెరాతో రాబోతోంది. దీంతో పాటు 5400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి..
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter