COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme C65 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్‌మీ ప్రీమియం ఫీచర్స్‌తో మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. కంపెనీ దీనిని C65 మోడల్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ మొబైల్‌ ఏప్రిల్‌ 26వ తేదిన మార్కెట్‌లోకి రాబోతోంది. కంపెనీ ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించింది. దీంతో పాటు ఇది ఎంతో శక్తివంతమైన ప్రపంచంలో ఏకైక మీడియాటెక్‌ D63000 చిప్‌సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇవే కాకుండా అనేక కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


ఇప్పటికే ఈ రియల్‌మీ సి65 (Realme C65) స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి మైక్రో సైట్‌ కూడా ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో డిస్ల్పే అవుతోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌కి సంబంధించిన ధర, ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌తో పాటు పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఈ మొబైల్‌ మొట్టమొదటి సారిగా ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కవ ధరలోనే లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో డిస్ల్పే అవుతున్న వివరాల ప్రకారం.. ఈ రియల్‌మీ సి65 మొబైల్‌ రూ.9,999 నుంచి ప్రారంభం కాబోతోంది. అలాగే దీనిని మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేక తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


ఇక ఈ Realme C65 స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో మొదటి వేరియంట్‌ 6GB RAM + 128GB స్టోరేజ్‌ను కలిగి ఉంటే, రెండవ స్టోరేజ్‌  8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వస్తుంది. ఇక రెండవ స్టోరేజ్‌ ధర విషయానికొస్తే ఇది రూ.11,999లతో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీని బ్యాక్‌ సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా అనేక ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


రియల్‌మీ సి65 స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ 10 ఫీచర్స్‌:
1. 50MP ప్రైమరీ కెమెరా
2. 120Hz రిఫ్రెష్ రేట్
3. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC
4. 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
5. 5000mAh బ్యాటరీ
6. 45W ఫాస్ట్ ఛార్జింగ్
7. 8GB RAM
8. 256GB స్టోరేజ్
9. IP54 డస్ట్, వాటర్ రిజిస్టెన్స్
10. రియల్‌మీ UI 5.0


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి