COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme Gt5 Pro Price: ప్రముఖ టెక్ కంపెనీ రియల్ మీ నుంచి అద్భుతమైన ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ అతి త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ఇటీవల రియల్ మీ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లకు మంచి గుర్తింపు రావడంతో ప్రీమియం ఫీచర్స్ కలిగిన మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అయితే త్వరలోనే విడుదల కాబోయే మొబైల్ GT సిరీస్‌లో రాబోతున్నట్లు రియల్ మీ వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు విడుదల కాబోతుందో, దీనికి సంబంధించిన ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


అతి త్వరలోనే విడుదల కాబోయే Realme GT5 Pro అనేక రకాల ప్రత్యేకమైన స్పెసిఫికేషన్స్ తో రాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుందని సమాచారం. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన టెలిఫోటో లెన్స్ కెమెరాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ 50 ఎంపీ IMX890 సోనీ పెరోస్కోప్ టెలిఫోటో లెన్స్ తో రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్లు విడుదలకు ముందే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ చైనాలోని 3సి సర్టిఫికేషన్ ను పొందింది.


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  



ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ తో పాటు మరెన్నో..
త్వరలో విడుదల కాబోయే Realme GT5 Pro మొబైల్ 100 వాట్స్ స్మార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ మొబైల్ కి సంబంధించిన సర్టిఫికేషన్ పనులను కూడా కంపెనీ పూర్తి చేసుకుంది. ఈ మొబైల్ 5g సపోర్ట్ తో పాటు TENAA సర్టిఫికేషన్ తో మార్కెట్లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఫోన్ 6.78 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 1264×2780 రిజల్యూషన్ వరకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా మొబైల్ సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా అందిస్తోంది.


4 అతిశక్తివంతమైన ఫీచర్లు ఇవే:
ఈ మొబైల్ బ్యాక్ లో చూసుకున్నట్లయితే త్రిపుల్ కెమెరా సెట్ అప్ ని కలిగి ఉంటుంది. కెమెరా మాడ్యూల్ లో భాగంగా మొదటి ప్రధాన కెమెరా 50 ఎంపీతో సోనీ లెన్సన్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్స్ తో పాటు ఫ్రంట్ భాగంలో సెల్ఫీ కోసం 32 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.  అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ పై పని చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మొబైల్ ను కంపెనీ మూడు ఇంటర్నల్ స్టోరేజ్ లో విడుదల చేయబోతోంది. గరిష్టంగా 1TB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ తో లభించబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించబోతున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook