COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Realme Narzo 60 Pro 5G Price: రీయల్ మీ స్మార్ట్‌ ఫోన్స్‌ ఇటీవలే విడుదల చేసిన ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ ఫోన్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. అతి తక్కువ ధరలో లభించడంతో విక్రయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మీరు కూడా రియల్ మీ బ్రాండ్ కు సంబంధించిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు. అతి తక్కువ ధరలోనే ఇటీవలే రియల్ మీ విడుదల చేసిన రియల్ మీ నార్జో 60 ప్రో (realme Narzo 60 pro 5G)  అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రస్తుతం రియల్ మీ నార్జో 60 ప్రో (realme Narzo 60 pro 5G) రెండు వేరియన్స్ లో లభిస్తోంది. అంతేకాకుండా నాలుగు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. మొదట ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ రూ. 26,999 విక్రయించింది. అయితే ఫ్రైడే ప్రత్యేక డీల్ లో భాగంగా 19 శాతం తగ్గింపుతో కేవలం రూ. 21,844కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ పై ఫ్లిప్‌కార్ట్‌ బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్స్ ను వినియోగించి మరింత తగ్గింపు పొందవచ్చు. 


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  


నార్జో 60 ప్రో (realme Narzo 60 pro 5G) స్మార్ట్ ఫోన్ మరింత తగ్గింపుతో బ్యాంక్ ఆఫర్స్‌లో కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ను వినియోగించడం వల్ల కూడా రూ.1,000 వరకు తగ్గింపు పొందవచ్చు.


అంతేకాకుండా ఈ మొబైల్ పై భారీ డిస్కౌంట్‌ను పొందడానికి ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు మీరు వన్ కార్డ్ క్రెడిట్ కార్డు వినియోగించిన దాదాపు రూ. 1,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో బ్యాంక్ ఆఫర్స్ ఫోను ఈ మొబైల్ ఫోన్ కేవలం రూ. 19,844కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 


ఫీచర్లు, స్పెసిఫికేషన్స్: 
6.7 అంగుళాలు AMOLED డిస్ప్లే
1080 x 2412 పిక్సెల్‌లు రిజల్యూషన్‌
డ్యూయల్ సిమ్ సెటప్‌
Mediatek MT6877V డైమెన్సిటీ 7050 చిప్‌సెట్    
ఆక్టా-కోర్ CPU
మాలి-G68 MC4 GPU
Li-Po 5000 mAh బ్యాటరీ
67W వైర్డు ఛార్జింగ్


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook