Realme Narzo n55: డెడ్ ఛీప్‌గా రియల్ మీ నుంచి నార్జో N55 5g స్మార్ట్ ఫోన్.. అప్పుడే లాంచింగ్
Realme Narzo n55 Price & launch details in India: రియల్ మీ మొబైల్ కంపెనీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల కాబోతోంది. ఇంతకుముందే ఉన్న నార్జో సిరీస్ ను అప్డేట్ వేరియంట్లలో కంపెనీ విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ కు సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Realme Narzo n55 Price, Price and Pre Booking DetailsIn in India: ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ భారత్ లో మరో సరికొత్త మొబైల్ ని విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ మొబైల్ కి సంబంధించిన సమాచారాన్ని అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది రియల్ మీ.. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న నార్జో సిరీస్ లోనే కొన్ని మార్పులు చేర్పులు చేసి నార్జో N55 (Realme Narzo n55) నామకరణంతో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక రిలీజ్ డేట్ విషయానికొస్తే ఏప్రిల్ 12వ తేదీన ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లో లభించే అవకాశాలు ఉన్నాయి. నార్జో N55 ప్రత్యేకత ఏంటో, ధర వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రియల్ మీ నార్జో సిరీస్ ఇంతకుముందే ప్రారంభించింది కంపెనీ.. అయితే ఇదే సిరీస్‌లో కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందించేందుకు తీసుకొస్తున్నట్లు రియల్ మీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లు ఉండడం వల్ల మార్కెట్లో మంచి పేరు పొందే అవకాశాలు ఉన్నాయి.
రియల్ మీ నార్జో N55(Realme Narzo n55) వివరాల వస్తే.. ఏప్రిల్ 12న మధ్యాహ్నం 12 గంటలకు ఈ కామర్స్ వెబ్సైట్లో లభించబోతోంది. మీరు తక్కువ ధరలో ఈ మొబైల్ ని కొనుగోలు చేయాలనుకుంటే ఆ రోజు కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక ధర విషయానికొస్తే.. ఈ మొబైల్ ఫోన్ ప్రీమియం లుక్ లో ఉండడం వల్ల సాధారణ వినియోగదారులకు లభించే విధంగా రూ. 15 వేల లోపే ఉంటుందని సమాచారం. అయితే అమెజాన్ లో ఈ స్మార్ట్ ఫోన్ రెండు కలర్లలో లభించబోతోంది. ప్రీమియం లుక్ లో కనిపించేందుకు మంచి డిజైన్ ని రియల్ మీ వినియోగదారులకు డెడ్ చీప్‌గా లభించబోతోంది.
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
రియల్ మీ నార్జో N55(Realme Narzo n55) ఫీచర్లు:
డ్యూయల్ కెమెరా సెటప్
పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్
30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
మైక్రోఫోన్
USB-C పోర్ట్
స్పీకర్ గ్రిల్
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook