Red Magic 8 Pro Price In India: ప్రస్తుతం యువత గేమింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీని కోసం భారీ ర్యామ్‌ కలిగి స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్‌లో చాలా అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ రెడ్ మ్యాజిక్ చెందిన స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ 24జీబీ ర్యామ్‌తో తర్వలో రాబోతోంది. రెడ్ మ్యాజిక్ 8ఎస్ ప్రోను అత్యంత శక్తి వంతమైన స్మార్ట్‌ ఫోన్‌గా ఇతర దేశాల్లో ఎంతో పేరు పొందింది. రెడ్ మ్యాజిక్ జూలై 5న భారత దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nubia చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో వివరాల ప్రకారం..ఈ స్మార్ట్‌ ఫోన్‌లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ పాటు.. 24GB ఫిజికల్ ర్యామ్ అందుబాటులో ఉందని కంపెనీ పేర్కొంది. భారీ ర్యామ్ సామర్థ్యంలో కలిగి ఈ మొబైల్‌ మల్టీ టాస్కింగ్, గేమింగ్‌తో పాటు హెవీ ఎడిటింగ్ ప్రక్రియను కూడా సులభంగా చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. వీలైనంత త్వరలోనే Red Magic 8S Proను 24GB RAMతో విడుదల చేయబోతున్నట్లు వివరించారు. 


Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..


ఈ స్మార్ట్‌ ఫోన్‌పై OnePlus, Realme చెందిన మొబైల్స్‌ కూడా పని చేయవని యూట్యూబ్‌ టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో కూడా 24 జిబి ర్యామ్‌తో రాబోతోందని తెలిపారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ కూడా వచ్చే నెలలో ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా దీనికి తోడుగా రియల్‌ మీ కూడా 24GBతో రాబోతోందని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే Red Magic 8S Pro స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి వస్తే ఈ రెండు స్మార్ట్‌ ఫోన్లపై పోటీకి దిగే ఛాన్స్‌ ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 


RedMagic 8S ప్రో ఫీచర్లు:
❃ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్
❃ 3.36GHz క్లాక్ స్పీడ్‌
❃ Adreno 740 GPU క్లాక్ స్పీడ్
❃ 680MHz నుంచి 719MHzకి బూస్ట్ అయ్యే ఫీచర్‌
❃ 6.8-అంగుళాల ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే
❃ 120Hz రిఫ్రెష్ రేట్
❃ 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్
❃ 16-మెగాపిక్సెల్ అండర్-డిస్ప్లే ఫ్రంట్ కెమెరా
❃ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
❃ 6000mAh బ్యాటరీ సపోర్ట్‌


Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి