COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi 12C Vs Redmi 13C: రెడ్‌మీ మొబైల్స్ అనగానే గుర్తుకు వచ్చే మోడల్స్ రెడ్‌మీ 12సీ, రెడ్‌మీ 13c. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ను కంపెనీ అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్లతో విక్రయిస్తోంది. అంతేకాకుండా ఈ రెండు మొబైల్స్ ప్రీమియం ప్రాసెసర్లతో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి గుర్తింపు ఉంది. బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ రెండు మొబైల్స్ బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు. అయితే ఈ రెండిటి మధ్య ఫీచర్స్ పరంగా ధర పరంగా అనేక తేడాలు ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్‌లో ఏది ప్రత్యేకమైనదో? ఈ రెండిటి మధ్య ఉన్న ప్రధాన తేడా ఏంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ రెడ్‌మీ 12సీ , రెడ్‌మీ 13c స్మార్ట్ ఫోన్స్ మధ్య ఉన్న తేడాల వివరాల్లోకి వెళితే..రెడ్‌మీ 12సీ స్మార్ట్ ఫోన్ 6.71-అంగుళాల HD+ LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో శక్తివంతమైన Unisoc T616 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇక రెడ్‌మీ 13c మొబైల్ కి సంబంధించిన వివరాలకు వెళ్తే.. ఇది  6.53-అంగుళాల HD+ LCD డిస్ప్లేతో అందుబాటులో ఉంది. 12సీ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే తో పోలిస్తే కాస్త పెద్దదిగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ MediaTek Helio G85 ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. 13c ఫోన్లో ఉండే ప్రాసెసర్ ముందు దానికంటే రెండు రెట్లు శక్తివంతమైందిగా చెప్పవచ్చు.


అలాగే ఈ రెండు మొబైల్‌కి సంబంధించిన స్టోరేజ్ విషయానికొస్తే..రెడ్‌మీ 12సీ స్మార్ట్ ఫోన్ 3GB, 4GB RAM వేరియంట్‌లలో లభిస్తోంది. స్టోరేజ్ పరంగా 64GB, 128GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇక రెడ్‌మీ 13c మొబైల్ 4GB, 6GB RAM వేరియంట్‌లలో లభిస్తుంది. స్టోరేజ్ పరంగా 64GB, 128GB వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రెడ్‌మీ 12సీ మొబైల్ 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌, 5000mAh బ్యాటరీతో లభిస్తోంది. రెడ్‌మీ 13c 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో కెమెరాతో బ్యాక్ లో త్రిపుల్ కెమెరా సెట్ కలిగి ఉంటుంది. ఇక దీని బ్యాటరీ కూడా రెడ్‌మీ 12సీ స్మార్ట్ ఫోన్ కు సమానంగా ఉంటుంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


అలాగే ఈ రెండు మొబైల్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. ఇందులో రెడ్‌మీ 13c స్మార్ట్ ఫోన్ మాత్రం 18W ఛార్జింగ్‌ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది.  అలాగే ఈ రెండింటిలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. రెడ్‌మీ 12సీ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటే, రెడ్‌మీ 13c మొబైల్ పక్కన ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇక ఈ మొబైల్స్ ధర విషయానికొస్తే, రెడ్‌మీ 12సీ  స్మార్ట్ ఫోన్ రూ.7,499తో ప్రారంభమవుతుంది. ఇక రెడ్‌మీ 13c మొబైల్ మాత్రం రూ.8,499తో లభిస్తోంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఏ మొబైల్ బెస్ట్ అంటే..ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారు రెడ్‌మీ 13c మొబైల్ మంచి ఎంపికగా భావించవచ్చు. ఈ రెండింటి మధ్య రూ.1,000 తేడా ఉన్నప్పటికీ. బ్యాటరీ, కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ పరంగా 13c మొబైల్ చాలా బెస్ట్.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి