Redmi 13C Price: ఊహించని ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Redmi 13C 5G వేరియంట్..ధర, పూర్తి వివరాలు ఇవే!
Redmi 13C Price: త్వరలోనే విడుదల కాబోయే Redmi 13C 5G వేరియంట్ సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మొబైల్ అతి తక్కువ ధరలో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi 13C Price: ప్రస్తుతం మార్కెట్‌లో బడ్జెట్ ధరలో లభించే కొన్ని స్మార్ట్ ఫోన్‌ని మాత్రమే మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా సాధరణ ధరలో లభించే రెడ్ మీ మొబైల్స్‌ను చాలా మంది కస్టమర్స్ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే మీరు కూడా మంచి స్మార్ట్ ఫోన్‌ను బడ్జెట్ ధరలో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మరికొన్ని రోజుల పాటు వేయిట్ చేయాల్సిందే. రెడ్ మీ అతి త్వరలోనే మార్కెట్‌లోకి మరో మొబైల్‌ను విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇంతక ముందు ఉన్న స్మార్ట్ ఫోన్స్ కంటే అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రాబోయే ఈ రెండ్ మీ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రెడ్ మీ తమ కొత్త స్మార్ట్ ఫోన్‌ను సీ సిరీస్‌లో విడుదల చేయబోతున్నట్లు పేర్కొంది. Redmi 13C 4G పేరుతో మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ డిసెంబర్ 6వ తేది భారత్‌లో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మొబైల్‌ను Redmi 12Cకి సక్సెసర్‌గా 5G వేరియంట్‌లో విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ చాలా శక్తివంతమైన ప్రాసెసర్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Redmi 13C 5G వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేయబోతున్నట్లు రెడ్‌మీ ఇండియా తెలిపింది. ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ. 15,000 కంటే తక్కువే ఉంటుందని పలువురు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మొబైల్ గరిష్టంగా 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుందని సమాచారం. అయితే విడుదల కాబోయే 4G వేరియంట్ మాత్రం గ్లోబల్ మోడల్ లాగా MediaTek Helio G85 ప్రాసెసర్‌తో రాబోతోంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
అతి శక్తివంతమైన కెమెరా:
భారత్‌లో Redmi 13C 4G స్మార్ట్ ఫోన్ స్టార్‌డస్ట్ బ్లాక్, స్టార్ షైన్ గ్రీన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోంది. ఈ మొబైల్ వెనుక ప్యానెల్‌లో శక్తివంతమైన 50MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్‌లో 4G వేరియంట్ కూడా రెండు వేరియంట్‌లో లాంచ్ కాబోతోంది. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించి ఫీచర్స్‌ను, ఇతర వివరాలను అధికారికంగా వెల్లడించలేదు.
ఫీచర్స్, స్పెసిఫికేషన్స్:
6.74 అంగుళాల LCD డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్
450నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్
50MP బ్యాక్ కెమెరా
2MP మాక్రో కెమెరా
8MP ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి