Redmi 13C Vs Redmi 12: ప్రస్తుతం మార్కెట్‌లో ప్రీమియం ఫీచర్స్‌ స్మార్ట్‌ఫోన్స్‌ కంటే లో రేంజ్‌లో లభించే మొబైల్స్‌కే ఎక్కువగా డిమాండ్ ఉంది. యువత ఎక్కువగా ఇలాంటి మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. అయితే టెక్‌ కంపెనీలు కూడా చాలా వరకు ఇలాంటి మొబైల్స్‌ను తయారు చేసే విక్రయిస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ లాంచ్‌ చేసిన రెడ్‌మీ 13సి (Redmi 13C), రెడ్‌మీ 12 5G (Redmi 12 5G) మార్కెట్‌లో మంచి డిమాండ్‌ లభించింది. వీటి రెండింటి విక్రయాలు రోజురోజుకు పెరగడం కారణంగా జనాలు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే చాలా మంది ఈ రెండిటో ఏది బెస్ట్ మొబైల్‌లో తెలుసుకువడానికి ఎక్కువగా గూగుల్‌ సెర్చ్‌ చేస్తున్నారు. వీటి రెండింటిలో ఏది బెస్ట్‌ మొబైలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెడ్‌మీ 13సి (Redmi 13C) Vs రెడ్‌మీ 12 5G (Redmi 12 5G)
ప్రముఖ టెక్‌ కంపెనీ రెడ్‌మీ ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను అతి శక్తివంతమైన డిస్‌ప్లే (Display)లతో విడుదల చేసింది. ఇందులో రెడ్‌మీ 12 మొబైల్‌ 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు రెడ్‌మీ 13సి స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 50Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ప్రాసెసర్ (Processor) వివరాల్లోకి వెళితే.. ఇందులో రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G85 ప్రాసెసర్‌తో లభిస్తోంది. ఇక రెడ్‌మీ 13సి మొబైల్‌ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 700 ప్రాసెసర్ 5G సపోర్ట్‌తో మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. 


ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ బ్యాక్‌ సెటప్‌లో డబుల్‌ కెమెరాలతో సిస్టమ్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇందులో రెడ్‌మీ 12 మొబైల్‌ 48MP ప్రధాన కెమెరాతో 2MP డెప్త్ సెన్సార్‌తో మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. రెడ్‌మి 13సి మొబైల్ మాత్రం బ్యాక్‌ సెటప్‌లో 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ విభిన్న స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తున్నాయి. ఇక బ్యాటరీ (Battery) వివరాల్లోకి వెళితే ఈ రెండిటిలో కంపెనీ శక్తివంతమైన 5000mAh బ్యాటరీని అందిస్తోంది. 


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..


ఈ రెడ్‌మీ 13సి, రెడ్‌మీ 12 5G స్మార్ట్‌ఫోన్స్‌ ధర (Price) వివరాల్లోకి వెళితే,  64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ కలిగిన రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్‌ ధర సుమారు రూ. 7,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెడ్‌మీ 13సి మొబైల్‌ ధర విషయానికొస్తే 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన వేరియంట్ సుమారు రూ. 9,999తో లభిస్తోంది. చివరిగా ఈ రెండిటో ఏది బెస్ట్‌ అంటే,  5G నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవాలనుకునేవారు రెడ్‌మీ 13సి స్మార్ట్‌ఫోన్‌ ది బెస్ట్‌..ఎందుకంటే ఇది ధర ఎక్కువైనప్పటికీ ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది శక్తివంతమైన కెమెరాతో కూడా లభిస్తోంది. ఇక అతి తక్కువ ధరలోనే కొన్ని ఫీచర్స్‌ కావాలనుకునేవారు రెడ్‌మీ 12 మొబైల్‌ని కొనుగోలు చేయోచ్చు. 


ఇది కూడా చదవండి: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter