Redmi A3 5G Price: తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్స్‌ అందించే ప్రముఖ కంపెనీల్లో Xiaomi ఎప్పుడు ముందుంటుంది. ఈ కంపెనీ మార్కెట్‌లోకి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. భారత మార్కెట్‌లోకి Xiaomi కంపెనీ Redmi A3ని బుధవారం 12 గంటలకు విడుదల చేసింది. ఈ మొబైల్‌ బేస్ వేరియంట్ ధర రూ. 12,999 కంటే తక్కువ ధరతో విడుదల చేసింది. ఇక హై-ఎండ్ వేరియంట్ విషయానికొస్తే ధర రూ. 14,999తో అందుబాటులో లభించనుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన టీజర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో డిస్ల్పే చేస్తోంది. ఈ Redmi A3 మొబైల్ హాలో డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది ప్రీమియం కెమెరాతో పాటు 5000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB వర్చువల్ ర్యామ్‌ సపోర్ట్‌తో పాటు 6GB RAM కాన్ఫిగరేషన్‌తో రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన టీజర్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా అందుబాటులో ఉంది. 


Redmi A3 స్పెషిఫికేషన్స్‌:
ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాల్లోకి వెళితే..ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.71 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీంతో పాటు ఈ డిస్ల్పే రిజల్యూషన్ 1600 x 720 పిక్సెల్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు స్క్రీన్ ప్రోటక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్‌ను కూడా అదనంగా అందిస్తోంది. అంలేకాకుండా ఈ డిస్‌ప్లే గరిష్టంగా 400 నిట్‌ల బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


ఈ Redmi A3 స్మార్ట్‌ఫోన్‌ Helio G36 చిప్‌సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అలాగే సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్‌ కోసం  8-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు నలుపు, నీలం రంగు కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్ 13 గో వెర్షన్‌పై రన్‌ అవుతుంది. ఇది 10W ఛార్జింగ్‌తో సపోర్ట్‌తో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు సులభంగా చార్జ్‌ చేసుకోవడానికి టైప్-సి ఛార్జర్‌ను కలిగి ఉంటుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter