COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi K70 Pro, K70E, K70 First Look: మార్కెట్‌లో రెండ్‌ మీ స్మార్ట్ ఫోన్స్‌కి ఉన్న డిమాండ్‌ అంతో ఇంతో కాదు. చాలా మంది ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన రెడ్‌ మొబైల్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే మీరు అతి తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన Redmi మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అతి త్వరలోనే మార్కెట్‌లోకి మరో మూడు రెడ్ మీ స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లు ప్రీమియం ఫీచర్స్‌తో పాటు చాలా రకాల స్పెషిఫికేషన్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదల కాబోయే మొబైల్స్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


Redmi బడ్జెట్‌లో లభించే స్మార్ట్ ఫోన్‌లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అతి త్వరలోనే  Redmi K70e, K70, K70 Pro అనే మూడు మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ మోడల్స్‌ను చైనా మార్కెట్‌లోకి విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్స్‌కి సంబంధించిన మోడల్స్‌పై రెడ్‌ ప్రత్యేక సేల్‌ను కూడా అందించింది. అయితే ఈ సేల్‌లో భాగంగా 5 నిమిషాల్లోనే 6,00,000 స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయని సంమాచారం. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


Redmi K70, K70 Pro ధర:
మొదట రెడ్‌ మీ Redmi K70, K70 మోడల్స్‌ను  బ్లాక్, గ్లేసియర్ సిల్వర్, బాంబూ మూన్ బ్లూ, లైట్ పర్పుల్ (ప్రో మాత్రమే) రంగులలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్స్‌ 12GB ర్యామ్‌ + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 16GB ర్యామ్‌ + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 16GB ర్యామ్‌ + 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్స్‌ ధరల విషయానికొస్తే చైనాలో 352 (రూ. 29,336) ప్రారంభమై..గరిష్టంగా 550 (రూ. 45,838)గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో మాత్రం ట్యాక్స్‌ల కారణంగా ఈ స్మార్ట్‌ ఫోన్స్‌ ధరలు పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. 


Redmi K70, Redmi K70 Pro స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు:
బాక్సీ మెటల్ ఫ్రేమ్‌
6.67-అంగుళాల TCL C8 OLED డిస్ప్లే
2K రిజల్యూషన్ స్క్రీన్‌
120Hz రిఫ్రెష్ రేట్‌
డాల్బీ విజన్‌కు సపోర్ట్
ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌
 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌
 OIS సపోర్ట్‌తో 50MP బ్యాక్‌ కెమెరా
8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా
 2MP మాక్రో యూనిట్‌ కెమెరా
2x జూమ్‌ సపోర్ట్
50MP టెలిఫోటో యూనిట్ కెమెరా


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి