COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi K70 Ultra Price: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ Redmi త్వరలోనే మార్కెట్‌లోకి మరో మొబైల్‌ను లాంచ్‌ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతున్నట్ల కంపెనీ వెల్లడించింది. కంపెనీ Redmi K70 Ultra మోడల్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ప్రముఖ టిప్‌స్టర్‌ డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్‌ మీడియా ద్వారా లీక్‌ చేశారు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


లీకైన వివరాల ప్రకారం..ఈ ఫోన్ హెవీ స్టోరేజ్‌తో పాటు ప్రీమియం డిస్ప్లే, ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి రాబోతోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 1.5K రిజల్యూషన్‌తో 8T LTPO OLED డిస్‌ప్లేతో రాబోతోంది. ఈ డిస్ప్లే సూపర్ స్లిమ్ బెజెల్స్‌తో వస్తోంది. ఈ డిస్‌ప్లే గరిష్టంగా 5000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది డైమెన్షన్ 9300 చిప్‌సెట్‌లో పని చేస్తుందని టిప్‌స్టర్ తెలిపారు. ఈ  Redmi K70 Ultra స్మార్ట్ ఫోన్‌ అతి శక్తివంతమైన 24 GB LPDDR5T ర్యామ్‌తో రాబోతోంది.    


ధర వివరాలు:
ఈ  Redmi K70 Ultra స్మార్ట్ ఫోన్‌ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం, 24 GB LPDDR5T ర్యామ్‌, 1 TB కలిగి వేరియంట్‌ రూ.15,000లోపే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. Redmi K70 Ultra లాంచ్‌ అయితే ప్రపంచంలోని  24GB LPDDR5T RAMతో వస్తున్న మొదటి మొబైల్‌ అవుతుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా కంపెనీ అధికారికంగా వివరించలేదు. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


లీక్‌ అయిన వివరాల ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్‌ మొత్తం మూడు కలర్స్‌, రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది. ఒక వేళ లాంచ్‌ అయితే అమెజాన్‌లోకి అందుబాటులో రానుంది. అయితే Redmi K60 Ultra మొబైల్‌ IP68 రేటింగ్‌తో రానుంది. ఇది మొట్టమొదటి  అల్యూమినియం ఫ్రేమ్‌తో మార్కెట్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌లో ఈ మొబైల్‌ విడుదైలే భారీ తగ్గింపు అందుబాటులోకి రానుంది. 


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter