Redmi Pad: రెడ్‌మి నుంచి కళ్లు చెదిరే డిజైన్, 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్‌మి ప్యాడ్ లాంచ్, ధర ఎంతంటే
Redmi Pad: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి నుంచి కళ్లు చెదిరే ఫీచర్లు, అద్బుతమైన బ్యాటరీ బ్యాకప్‌తో రెడ్‌మి ప్యాడ్ లాంచ్ అయింది. ప్రస్తుతం విక్రయాలు జరుగుతున్న రెడ్‌మి ప్యాడ్ వివరాలు మీ కోసం..
Redmi Pad ఇండియాలో లాంచ్ అయింది. ప్రముఖ చైనా దిగ్గజం రెడ్‌మి నుంచి ఇది తొలి ట్యాబ్ కావడం విశేషం. ఈ ట్యాబ్‌లెట్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. అక్టోబర్ 5 అంటే రేపట్నించి రెడ్‌మి ప్యాడ్ అమ్మకాలు Mi.com, Mi Homes, Flipkartలో ప్రారంభం కానున్నాయి.
రెడ్‌మి ప్యాడ్ పేరుతో లాంచ్ అయిన రెడ్‌మి ట్యాబ్‌లెట్ 12,999 రూపాయలకు లభ్యం కానుంది. ఈ ట్యాబ్‌లెట్ మూడు వేరియంట్లలో వస్తోంది. ఇందులో టాప్ ఎండ్ మోడల్ 6 జీబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. అక్టోబర్ 5వ తేదీ ఉదయం 10 గంటల్నించి విక్రయాలు ప్రారంభమౌతున్నాయి. రెడ్‌మి ప్యాడ్‌తో పాటు గేమర్స్, మల్టీటాస్కర్, సినిమా ప్రేమికుల్ని కూడా కంపెనీ టార్గెట్ చేస్తోంది. రెడ్‌మి ప్యాడ్ 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హెలియో జి99 ప్రత్యేకతలు. అన్నింటికీ మించి 8000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ప్రధానమైన ఆకర్షణగా ఉంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ కలిగి ఉంది.
రెడ్‌మి ప్యాడ్ మూడు వేరియంట్లలో లభ్యం
ఇందులో బేస్ మోడల్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ మోడల్ 12,999 రూపాయలకు లభ్యం కానుంది. ఇక 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అయితే 14,999 రూపాయలకు అందుతోంది. టాప్ ఎండ్ మోడల్ 19,999 రూపాయలకు లభిస్తుంది. రెడ్‌మి ప్యాడ్ మూడు రంగుల్లో అంటే గ్రాఫైట్ గ్రే, మూన్‌లైట్ సిల్వర్, మింట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
రెడ్‌మి ప్యాడ్ ఫీచర్లు
రెడ్‌మి ప్యాడ్ 10.61 ఇంచెస్ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రేష్ రేట్‌తో వస్తుంది. ఈ ధరలో ఇలాంటి ఫీచర్లు ఉండటం ఇదే తొలిసారి. ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉంది. మీడియాటెక్ హెలియో జి99 చిప్‌సెట్ ప్రత్యేకత. స్టోరేజ్‌ను 1 టీబీ వరకూ పెంచుకోవచ్చు. వైఫై 5 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 వెర్షన్, డ్యూయల్ మైక్రోఫోన్,థర్డ్ పార్టీ ప్యాన్ సపోర్ట్ , బిల్ట్ ఇన్ డాక్యుమెంట్ స్పీకర్ ఉన్నాయి. రెడ్‌మి ప్యాడ్ ట్యాబ్‌లెట్ MIUI 13 ఆధారిత Android 12 పై నడుస్తుంది. స్ప్లిట్ స్క్రీన్, ఫ్లోటింగ్ విండో, మల్టీ విండో సపోర్ట్, రీడింగ్ మోడ్ వంటి ప్రత్యేకతలున్నాయి. దీంతోపాటు యూజర్లకు 2 నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వం లభిస్తుంది.
రెడ్‌మి ప్యాడ్‌లో 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్రధాన ప్రత్యేకతలు. బాక్స్‌లో 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. 21 గంటలపాటు నిరంతరంగా వీడియో చూడవచ్చు. 12 గంటలసేపు గేమ్స్ ఆడవచ్చు. 8 రోజుల వరకూ మ్యూజిక్ వినవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook