IPO News: కేవలం 14 వేల పెట్టుబడి, కొద్దిరోజుల్లోనే రెట్టింపయ్యే అవకాశం, ఎలాగంటే

IPO News: షేర్ మార్కెట్ అనేది ఒక్కోసారి భారీగా లాభాల్ని అందిస్తుంది. అలాంటిదే ఇది. కేవలం 14 వేల రూపాయల పెట్టుబడితో..రోజుల వ్యవధిలో రెట్టింపు లాభం పొందవచ్చు. ఎలాగో చూద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 4, 2022, 07:26 PM IST
IPO News: కేవలం 14 వేల పెట్టుబడి, కొద్దిరోజుల్లోనే రెట్టింపయ్యే అవకాశం, ఎలాగంటే

ఐపీవో అంటే షేర్ మార్కెట్‌లో పెట్టుబడితో డబ్బులు సంపాదించే ఆలోచన ఉంటే మీకు గుడ్‌న్యూస్. మార్కెట్‌లో చాలా ఐపీవోలు ఇన్వెస్టర్లకు భారీగా లాభాలు అందిస్తున్నాయి. అలాంటిదే ఓ మంచి అవకాశమిది. ఇందులో కేవలం 14, 224 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు. రోజుల వ్యవధిలోనే మీ పెట్టుబడిని రెట్టింపు చేసుకోవచ్చు. 

కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రిటైల్ ఛైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా ఐపీవో ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 7 వరకూ ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఐపీవోలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి దాదాపుగా 150 కోట్ల రూపాయలు సమీకరించనుంది. ఈ ఐపీవోలో కంపెనీ 500 కోట్ల రూపాయలు ఫ్రెష్ ఇష్యూ జారీ చేసేందుకు యోచిస్తోంది. ఒకవేళ మీరు కూడా పెట్టుబడికి ప్లాన్ చేస్తుంటే..ఈ ఐపీవో వివరాలు ఓసారి చెక్ చేసుకోండి.

కనీస పెట్టుబడి                                     14,224 రూపాయలు
లాట్ పరిమాణం                                   254
ప్రైస్ బ్యాండ్                                        56-59 రూపాయలు
ప్రారంభ తేదీ                                        అక్టోబర్ 4, 2022
క్లోజింగ్ తేదీ                                           అక్టోబర్ 7, 2022
ఇష్యూ సైజ్                                          500 కోట్లు

ఈ ఐపీవో ద్వారా సమీకరించిన పెట్టుబడిని కంపెనీ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఖర్చు చేయనుంది. దాంతోపాటు అప్పులు తీర్చేందుకు కూడా వినియోగించనుంది. 

కంపెనీ నేపధ్యం

ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ కంపెనీను పవన్ కుమార్ బజాజ్, కరణ్ బజాజ్‌లు కలిసి బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టోర్ రూపంలో 1980లో స్థాపించారు. ఈ కంపెనీ ఆగస్టు వరకూ 36 నగరాల్లో 112 స్టోర్స్ కలిగి ఉంది. అంతేకాకుండా..మల్టీ బ్రాండ్ అవుట్‌లెట్ కిచెన్ స్టోరీస్ పేరుతో స్టోర్స్ నడుపుతోంది. ఈ స్టోర్స్‌లో కంపెనీ కిచెన్ అవసరాల్ని తీరుస్తోంది. 

Also read: LPG Gas Price: పండుగ వేళ సామాన్యుడికి షాక్, పెరగనున్న వంట గ్యాస్, ఎంత పెరుగుతుందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News