Redmi Note 13 5G Vs Oneplus Nord Ce 3 Lite 5G: ఈ రెండింటిలో శక్తివంతమైన మొబైల్ ఇదే.. ఫీచర్స్ పరంగా చాలా బెస్ట్!
Redmi Note 13 5G Vs Oneplus Nord Ce 3 Lite 5G: ప్రీమియం ఫీచర్స్ కలిగిన రెడ్మి నోట్ 13 5G, వన్‌ప్లస్ నోర్డ్ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ మొబైల్‌ను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ మొబైలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Redmi Note 13 5G Vs Oneplus Nord Ce 3 Lite 5G: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ మొబైల్స్‌కి మార్కెట్‌లో ప్రత్యేక డిమాండ్ ఉంది. చాలా మంది ప్రీమియం ఫీచర్స్ కలిగిన వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నోర్డ్ CE 3 లైట్ విక్రయాల్లో దూసుకుపోతోంది. ఇది శక్తివంతమైన ఫీచర్స్‌తో అతి తక్కువ ధరకే లభించడం వల్ల చాలా మంది దీనిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ వన్‌ప్లస్ నోర్డ్ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రెడ్‌మీ లాంచ్ చేసిన నోట్ 13 5G సిరీస్‌తో విక్రయాలతో పోటీ పడుతోంది. ఈ రెండు మొబైల్స్ అతి తక్కువ ధరల్లోనే విభిన్నమైన తేడాల్లో లభించడం వల్ల ఏది కోనుగోలు చేయాలో అని తికమకపడుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెడ్మి నోట్ 13 5G, వన్‌ప్లస్ నోర్డ్ CE 3 లైట్ 5G రెండు స్మార్ట్‌ఫోన్స్ వివరాల్లోకి వెళితే.. రెడ్మి నోట్ 13 5G స్మార్ట్‌ఫోన్ AMOLED డిస్‌ప్లేతో ప్రీమియం కలర్స్, డీప్ బ్లాక్స్ కలర్స్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఇది అతి శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో లభిస్తోంది. దీంతో పాటు స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక వన్‌ప్లస్ నోర్డ్ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ వివరాల్లోకి వెళితే, ఇది LCD డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఇది స్నాప్‌డ్రాగన్ 480+ 5G చిప్‌సెట్‌పై పని చేస్తుంది. ఈ వన్‌ప్లస్ నోర్డ్ CE 3 లైట్ 5G మొబైల్ 4500mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.
ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ కెమెరా వివరాల్లోకి వెళితే, రెడ్మీ నోట్ 13 5G స్మార్ట్‌ఫోన్ 50MP ప్రధాన కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ MIUI 14 (హెవీ కస్టమ్ UI) ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తోంది. ఇక వన్‌ప్లస్ నోర్డ్ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 64MP ప్రధాన కెమెరాతో లభిస్తోంది. ఇది OxygenOS 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అలాగే ఈ మొబైల్ 65W ఫాస్టర్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. రెడ్మీ నోట్ 13 5G స్మార్ట్‌ఫోన్ మాత్రం 33W ఫాస్టర్ ఛార్జింగ్‌తో లభిస్తోంది.
ఇదే బెస్ట్ మొబైల్:
శక్తివంతమైన డిస్‌ప్లే, బ్యాటరీ లైఫ్, కెమెరా పనితీరు కావాలంటే రెడ్మీ నోట్ 13 5G మొబైల్ చాలా మంచి ఎంపికగా భావించవచ్చు. నూతన Android, ఫాస్టర్ ఛార్జింగ్ సపోర్ట్, ఇతర ఫీచర్స్ కావాలనుకునేవారు వన్‌ప్లస్ నోర్డ్ CE 3 లైట్ 5G కొనుగోలు చేయోచ్చు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ అంటే రెడ్మీ నోట్ 13 5G గానే భావించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి