Redmi Pad Pro: 10000mAh బ్యాటరీ ఫీచర్‌తో త్వరలోనే Redmi Pad Pro లాంచ్.. ఫీచర్స్ ఇలా..
Redmi Pad Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మార్కెట్‌లోకి కొత్త ప్యాడ్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో చైనాలో లాంచింగ్‌కి సిద్ధంగా ఉంది. అయితే ఈ ప్యాడ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Redmi Pad Pro: ప్రముఖ టెక్ కంపెనీ రెడ్‌మీ తమ ప్యాడ్ ప్రోను త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్ చేయబోతోంది. దీనిని కంపెనీ మొదట చైనాలో విడుదల చేసి, ఆ తర్వాత గ్లోబల్ లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ రెడ్‌మీ ప్యాడ్ ప్రోకి సంబంధించి ప్రీ ఆర్డర్స్‌ను కూడా కంపెనీ త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్యాడ్ చైనాలో ఏప్రిల్ 15వ తేదిన విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ట్యాబ్‌కి సంబంధించిన గ్లోబల్ లాంచింగ్ తేదిని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే విడుదల చేసే అవకాశాల ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ ప్యాడ్‌ని మొత్తం రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కంపెనీ 2405CRPFDL మోడల్ నెంబర్‌తో చైనాలో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక గ్లోబల్ వేరియంట్ మోడల్ విషయానికొస్తే 2405CRPFDGతో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్ ట్యాబ్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
గ్లోబల్ మోడల్ లిస్టింగ్‌లో నమోదైన వివరాల ప్రకారం.. రెడ్‌మీ ఈ ప్యాడ్‌లో Adreno 7 గ్రాఫిక్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి రాబోతోంది. ఈ ప్యాడ్ 1600x2560 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడా స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది 8GB ర్యామ్‌తో మార్కెట్‌లో లభించబోతోంది. అలాగే ఈ స్మార్ట్ ట్యాబ్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా HyperOS వెర్షన్ 1.0పై రన్ కానుంది. ఇవే కాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
Redmi Pad Pro ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
Redmi Pad Pro ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది 12.1 అంగుళాల LCD ప్యానెల్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది 2.5K రిజల్యూషన్‌ని కలిగి ఉంటుంది. దీంతో గరిష్టంగా 600 నిట్స్‌ల బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే ఇది డాల్బీ విజన్ డిస్‌ప్లే సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ ప్యాడ్ బ్యాక్ సెటప్‌లో 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, LED ఫ్లాష్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఫ్రంట్ భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్పీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
8 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్
Snapdragon 7s Gen 2 ప్రాసెసర్
10000mAh బ్యాటరీ
33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
డాల్బీ అట్మోస్ సపోర్ట్
Wi-Fi 6, బ్లూటూత్ 5.2
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి