Redme Note 14 Series: త్వరలో 50 MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాతో 6200 mAH బ్యాటరీ ఫోన్ లాంచ్
Redme Note 14 Series: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్ మి నుంచి త్వరలో కొత్త మోడల్ లాంచ్ కానుంది. భారతదేశ మార్కెట్‌లో రెడ్ మి ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో రెడ్ మి నుంచి త్వరలో లాంచ్ కానున్న రెడ్ మి నోట్ 14 సిరీస్ ఫోన్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ వివరాలు మీ కోసం.
Redme Note 14 Series: Redme Series నుంచి త్వరలో భారతీయ మార్కెట్‌లో Redme Note 14, Redme Note 14 Pro, Redmi Note 14 Pro Plus లాంచ్ కానున్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, సెల్ఫీ కెమేరాతో పాటు ఏకంగా 6200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉండటంతో కచ్చితంగా మార్కెట్‌లో ఇవి సంచలనం రేపనున్నాయి.
రెడ్ మి నోట్ 14 సిరీస్ ఫోన్ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇందులో ఇతర వేరియంట్లయితే 1.5 కే డిస్ ప్లే కలిగి ఉంటాయి. రెడ్ మి నోట్ 14 డ్యూయల్ కెమేరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ప్రో మోడల్ అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ప్లస్ మోడల్ అయితే స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇక బ్యాటరీ వేరియంట్ కూడా మోడల్‌ను బట్టి మారుతుంది. రెడ్ మి నోట్ 14 సిరీస్ 5110 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటే..ప్రో మోడల్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుంది. ఇక ప్రో ప్లస్ మోడల్ అయితే 6200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో 45 వాట్స్ నుంచి 90 వాట్స్ వరకూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
రెడ్ మి నోట్ 14లో 50 మెగాపిక్సెల్ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరాతోపాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంటుంది. ఇక ప్రో ప్లస్ మోడల్‌లో అయితే అదనంగా టెలీఫోటో కెమేరా ఉండి త్రిబుల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఇప్పటికే చైనాలో ఈ మోడల్ లాంచ్ అయింది. ఇండియాలో జనవరి 10 నుంచి 15 మధ్యకాలంలో లాంచ్ కావచ్చు.
Also read: AP Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఏపీకు వర్షసూచన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.