Jio Bharat J1: యూపీఐ చెల్లింపులు, లైవ్ టీవీ స్ట్రీమింగ్ తో జియో నుంచి కొత్త ఫోన్, ధర చాలా చాలా తక్కువ
Jio Bharat J1: రిలయన్స్ జియో టెలీకం రంగంపై ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగిస్తోంది. ఇటీవలే రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని పెంచిన జియో ఇప్పుడు తక్కువ ధరకు మరో ఫోన్ లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jio Bharat J1: రిలయన్స్ జియో మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పటికే చౌక ధరకు చాలా ఫోన్లు లాంచ్ చేసింది. అదే కేవలో కేవలం 1799 రూపాయలకే యూపీఐ యాప్స్, లైవ్ టీవీ, 4జి ఫీచర్లతో భారత్ జీ1 పేరుతో కొత్త ఫోన్ ఇది. 4జి నెట్వర్క్ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్ మార్కెట్ లో సంచలనం రేపనుంది.
ప్రముఖ ప్రైవేట్ టెలీకం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా లాంచ్ చేసిన ఫోన్ జియో భారత్ జీ1. చూడ్డానికి సాధారణ ఫోన్ లా ఉంటుంది. కానీ స్మార్ట్ ఫోన్లలో ఉండే అన్ని ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఈ ఫోన్ సైజ్ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. ఇదొక కీ బోర్డ్ ఫోన్. 2.8 ఇంచెస్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 2500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. స్టాండ్ బై మోడ్ వదిలేసినా రెండు రోజులు పనిచేస్తుంది. పాత నోకియా 3100 ఫోన్ పోలి ఉంటుంది. కీ బోర్డ్ ఆధారిత ఫోన్ ఇది. కానీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు అన్నీ ఉంటాయి.ఇందులో అన్ని యూపీఐ యాప్స్ సేవలు పొందవచ్చు. జియో పే కూడా ఇన్ స్టాల్ చేసుకుని చెల్లింపులు చేయవచ్చు. అన్నింటికీ మించి జియో సినిమా సపోర్ట్ చేస్తుంది. సినిమాలు స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. దీనికోసం మెరుగైన అవుట్ డిస్ ప్లే ఉంటుంది.
జియో భారత్ జీ1 4జి పోన్ ప్రస్తుతం అమెజాన్ లో అందుబాటులో ఉంది. సింగిల్ బ్లాక్, గ్రే రుంగుల్లో లభిస్తున్న ఈ ఫోన్ ధర చాలా తక్కువ. కేవలం 1799 రూపాయలకే లభిస్తోంది. జియో భారత్ జీ1 ఫోన్ కేవలం జియో సిమ్ కార్డుల్నే సపోర్ట్ చేస్తుంది. ఇతర నెట్వర్క్ సిమ్ కార్డులు ఇందులో పనిచేయవు. లైవ్ టీవీ, యూపీఐ చెల్లింపులు, రఫ్ అండ్ రఫ్ వినియోగం ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook