Jio Book Laptop: దుమ్ములేపే ఫీచర్లతో Jio Book ల్యాప్‌టాప్.. ధర రూ.15 వేలలోపే..!
Jio Book Laptop Price and Features: రిలయన్స్ జియో తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. JioBook 4G ల్యాప్‌టాప్‌ను కేవలం రూ.14,701కే అందజేస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ఫీచర్లు ఎలా ఉన్నాయి..? ఎక్కడ బుక్ చేసుకోవాలి..? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
Jio Book Laptop Price and Features: తక్కువ బడ్జెట్‌లో ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్. ఫ్రెండ్లీ బడ్జెట్‌లో సరికొత్త ల్యాప్‌టాప్‌ను రిలయన్స్ జియో పరిచయం చేసింది. ఇప్పటికే టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చేసిన జియో.. ల్యాప్‌టాప్ రంగంలో సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైంది. తాజాగా పరిచయం చేసిన ల్యాప్‌టాప్ 100 జీబీ క్లౌడ్ స్టోరేజీతో పాటు ఎన్నో అద్భుతమైన ఫీచర్లను యాడ్ చేసింది. భారత్‌లో ఇదే మొట్టమొదటి లెర్నింగ్ ల్యాప్‌టాప్ కావడం విశేషం. హై ఎండ్ ల్యాప్‌టాప్‌లలో జియో బుక్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయోనని అందరూ ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
Also Read: Eating Expired Food: గడువు తీరిన ఆహారం తింటే శరీరానికి ఏమవుతుంది?
స్టూడెంట్స్‌కు డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం.. ఈ మెయిల్స్ సెండ్ చేయడంతోపాటు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. జియో బుక్ ల్యాప్‌టాప్‌లో కోడింగ్ కూడా నేర్చుకోవచ్చు. JIO Book ల్యాప్‌టాప్‌కు 4G కనెక్టివిటీ సపోర్ట్ ఉండడంతో వైఫైకు కనెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
జియోబుక్ JioOSను బాక్స్ వెలుపల రన్ చేస్తుంది. 4GB RAM, 64GB స్టోరేజ్‌తో యాడ్ చేసిన MediaTek చిప్‌సెట్‌తో ఉంటుంది. మీరు కావాలంటే ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌తో పాటు కొనుగోలుదారులకు 100GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. JioBook 11.6-అంగుళాల HD డిప్‌ప్లేతో ఉంటుంది. కేవలం 990 గ్రాముల బరువు ఉండగా.. గ్రే, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. బ్యాటరీ బ్యాకప్ దాదాపు 8 గంటల వరకు ఉంటుందని జియో కంపెనీ చెబుతోంది.
డిజైన్ విషయానికి వస్తే జియోబుక్ ప్లాస్టిక్ బాడీ.. మూతలో 'జియో' లోగోతో 2022లో లాంచ్ చేసిన మాదిరిగానే కనిపిస్తుంది. ఇది పాత వెర్షన్ కంటే తేలికగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ మొదట ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2022)లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. రూ.19,500 ధరతో ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్‌లో సెలైంట్‌గా రిలీజ్ చేశారు. అప్పట్లో ప్రభుత్వ అధికారులకు మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం అందరూ కొనుగోలు చేయవచ్చు. JioBook 4G ధర రూ.14,701 ఉండగా.. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ.350 వరకు తగ్గింపును పొందవచ్చు. రిలయన్స్ డిజిటల్ షోరూమ్స్, ఆన్‌లైన్‌లో, అమెజాన్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్ మీ వద్దకు వచ్చిన తరువాత డిజైన్‌కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా.. సర్వీసు సెంటర్లు, కస్టమర్ కేర్ కాల్ సెంటర్ల ద్వారా పరిష్కరించుకోవచ్చు.
Also Read: Movie Chance Fraud: సినిమా ఛాన్స్‌ల పేరిట తన 'కోరికలు' తీర్చుకుని మోసం చేసిన నటుడు
అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter