Airtel vs Jio Plans: అటు కస్టమర్లు సైతం తమ డబ్బులకు తగ్గ ప్రయోజనాన్ని పొందగలిగే వివిధ ఆఫర్ల గురించి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రీ పెయిడ్ ప్లాన్స్‌లో ఏవి మెరుగైనవో పరిశీలిస్తుంటారు. హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ ఇలా వివిధ అంశాల్లో జియో, ఎయిర్‌టెల్ మధ్య అంతరాన్ని గమనిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందులో భాగంగా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న 299 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్ గురించి వివరాలు తెలుసుకుందాం. రెండింటిలో కలిగే ప్రయోజనాలు, రెండింటి మధ్య ఉండే అంతరం గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం.


రిలయన్స్ జియో 299 రూపాయల ప్లాన్


రిలయన్స్ జియో అందిస్తున్న 299 రూపాయల ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉటుంది. ఈ ప్లాన్‌లో 56 జీబీ డేటా రోజుకు 2 జీబీ చొప్పున అందుతుంది. డేటా అయిపోతే ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్ మాత్రమే ఉంటుంది. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా లభిస్తాయి. 


ఎయిర్‌టెల్ 299 రూపాయ ప్లాన్


ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున 42 జీబీ డేటా అందుతుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. 


ఎయిర్‌టెల్ వర్సెస్ జియో మధ్య అంతరం


ఇక ప్రయోజనాల గురించి పరిశీలిస్తే రిలయన్స్ జియో 299 రూపాయల ప్లాన్‌లో అధిక ప్రయోజనాలున్నాయి. ఇందులో 56 జీబీ డేటా అందుతుంది. ఇది కాకుండా అదనంగా 7వ వార్షికోత్సవం పురస్కరించుకుని 7 జీబీ డేటా కూడా ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. ఇక ఎయిర్‌టెల్ 299 రూపాయల ప్లాన్‌లో 42 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. అంటే ఎయిర్‌టెల్ కంటే జియో ప్లాన్‌లో 21 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. 


Also read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. త్వరలోనే ప్రకటన..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook