Samsung Galaxy A25 5G Price: దీపావళి రోజు సాంసంగ్ తన కస్టమర్స్ కి గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే మార్కెట్లోకి మరో 5జి స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ మొబైల్ ఇంతకుముందు విడుదల చేసిన A సిరీస్ కు సక్సెర్ గా తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A25 5G పేరుతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది ఈ మొబైల్ ఫోన్ కు సంబంధించిన ఆన్లైన్ సర్టిఫికేషన్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో.. ధర అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ Samsung Galaxy A25 5G స్మార్ట్ ఫోన్ విడుదల ఇతర సంబంధిత వివరాలపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ కు సంబంధించిన అన్ని వివరాలు MySmartPrice అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. BIS ఇండియా వెబ్‌సైట్‌లో SM-A256E/DSN మోడల్ నంబర్‌తో వస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా FCC జాబితా ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది.


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్‌లు:
ఇటీవలి Geekbench జాబితా ప్రకారం.. త్వరలోనే మార్కెట్లోకి విడుదల కాబోయే Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్‌ మొదట 8GB RAM వేరియంట్ లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఫోన్ ఆక్టా-కోర్ Exynos 1280 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా OneUIలో రన్ అవుతుంది. ఈ మొబైల్ గీక్‌బెంచ్ ప్లాట్‌ఫారమ్‌లో సింగిల్-కోర్, మల్టీ-కోర్ పరీక్షలలో వరుసగా 937, 2106 పాయింట్ల స్కోర్ ను సాధించింది. Galaxy A25 5G 6.44 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ సెల్ఫీకెమెరా కోసం ఫోన్వాటర్-డ్రాప్ నాచ్‌తో వస్తుంది.


ఇతర ఫీచర్స్‌:
50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా
 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
8GB RAM వేరియంట్
6.44 అంగుళాల డిస్ప్లే
ఫోన్వాటర్-డ్రాప్ నాచ్‌


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook