Samsung Galaxy A54 5G త్వరలో లాంచ్‌కు సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, కెమేరా, బ్యాటరీ, డిజైన్ చూస్తే మతిపోతుంది ఎవరికైనా. ఆ వివరాలు మనమూ తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy A54 5G త్వరలో చైనా మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5జి సామర్ధ్యం కలిగింది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వెసులుబాటు కలిగి ఉంది. ఇదే సిరీస్‌లో ఎ53 ఛార్జర్ లేకుండా రావడంతో..ఈ స్మార్ట్‌ఫోన్ కూడా ఛార్జర్ లేకుండా వస్తుందని అంచనా.


Samsung Galaxy A54 5G త్వరలో చైనా మార్కెట్‌లో, ఆ తరువాత భారతీయ మార్కెట్‌లో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందనేది ఇంకా తెలియలేదు. ధరపై ఇంకా స్పెక్యులేషన్లు కూడా పెద్దగా లేవు. 


Samsung Galaxy A54 5G ఫీచర్లు


ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. 5100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుందని అంచనా. గత మోడల్‌తో పోలిస్తే..100 ఎంఏహెచ్ ఎక్కువ. గెలాక్సీ ఏ54..5జీలో 50 మెగాపిక్సెల్ కెమేరాతో ట్రిపుల్ కెమేరా ఉంటుందని తెలుస్తోంది. 


Samsung Galaxy A54 5G కెమేరా


ఇది 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్‌తో రానుందని అంచనా. ఇందులో డెప్త్ సెన్సార్ ఉండదని తెలుస్తోంది. ఏ54 స్మార్ట్‌ఫోన్ నాలుగేళ్ల వరకూ ఓఎస్ అప్‌గ్రేడ్‌తో లభిస్తుంది. బాక్స్ మాత్రం 13 ఓఎస్‌తో వచ్చి..ఆ తరువాత 17 ఓఎస్ వరకూ అప్‌‌గ్రేడ్ అవుతుంది.


Also read: LIC Scheme: ఆ ఎల్ఐసీ పధకంలో..నేరుగా కోటి రూపాయలు ప్రయోజనం, ఎలాగంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook