Samsung Galaxy F15 5G Price Cut: హిందువులకు ఎంతో ముఖ్యమైన ఉగాది పండగ ఏప్రిల్ 9వ తేదీన వచ్చింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు వస్తువులపై ప్రత్యేకమైన తగ్గింపు అందిస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్ అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఇక ఫ్లిఫ్‌కార్ట్‌ విషయానికొస్తే, కొన్ని బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్ పై డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు అదనంగా ఎక్స్చేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. ముఖ్యంగా మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌పై ప్రత్యేకమైన తగ్గింపును అందిస్తోంది. ఇదిలా ఉండగా సాంసంగ్ ఇటీవలే లాంచ్ చేసిన ఎఫ్ సిరీస్ మొబైల్ పై ప్రత్యేకమైన ఉగాది ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఉగాది ఆఫర్స్‌లో భాగంగా ఎంత తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు, దీనిపై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే సాంసంగ్ విడుదల చేసిన గెలాక్సీ ఎఫ్ 15 (SAMSUNG Galaxy F15 5G) సిరీస్ మొబైల్‌కి మార్కెట్లో మంచి గుర్తింపు లభించింది.  దీంతో ఈ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన ఉగాది డిస్కౌంట్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ మూడు కలర్ ఆప్షన్స్‌లో రెండు విభిన్న స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6 జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన ఈ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో MRP ధర రూ. 16,999కు లభిస్తోంది. అయితే ఉగాదిని దృష్టిలో పెట్టుకొని ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్ ఫోన్ పై 16 శాతం తగ్గింపుతో కేవలం రూ.14,499కే అందిస్తోంది. దీంతోపాటు ఈ మొబైల్ పై మరిన్ని ఆఫీస్ కూడా అందుబాటులో ఉన్నాయి.


సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 (SAMSUNG Galaxy F15 5G) స్మార్ట్ ఫోన్ పై అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ బ్యాంక్ ఆఫర్స్ పొందాలనుకుంటున్న వారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే దాదాపు రూ. 1 వెయ్యి వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి కొనుగోలు చేసే వారికి కూడా ఐదు శాతం వరకు బ్యాంకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ మొబైల్ కేవలం రూ.13,499కే లభిస్తుంది. దీంతోపాటు అదనంగా మరెన్నో బ్యాంకులకు సంబంధించిన అందుబాటులో ఉన్నాయి. వీటిని తెలుసుకోవడానికి అధికారిక ఫ్లిఫ్‌కార్ట్‌ వెబ్సైటును సందర్శించండి.


సాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 15 టాప్ ఫీచర్స్:
డిస్ప్లే:

6.6 అంగుళాల ఫుల్ HD+ PLS LCD డిస్ప్లే
90Hz రిఫ్రెష్ రేట్
20:9 యాస్పెక్ట్ రేషియో


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


ప్రాసెసర్:
Exynos 1330 ఆక్టా-కోర్ ప్రాసెసర్
4GB RAM
64GB/128GB స్టోరేజ్
మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ విస్తరణ


కెమెరా:
50MP ప్రధాన కెమెరా
8MP అల్ట్రా వైడ్ కెమెరా
2MP మాక్రో కెమెరా
2MP డెప్త్ కెమెరా
13MP సెల్ఫీ కెమెరా


బ్యాటరీ:
6000mAh బ్యాటరీ
15W ఫాస్ట్ చార్జింగ్


ఇతర ఫీచర్స్:
Android 12 ఆపరేటింగ్ సిస్టమ్
One UI 4.1
5G కనెక్టివిటీ
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
3.5mm హెడ్‌ఫోన్ జాక్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి