COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drop Samsung Galaxy F34 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లోని దసరా సేల్ రేపటితో ముగియనుంది. రేపే చివరి తేదీ కావడంతో ఈ సేల్ లో భాగంగా అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ బిగ్ దసరా సేల్ లో భాగంగా మొబైల్స్ ని కొనుగోలు చేసే వారికి దాదాపు 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ సేల్ లో ఏయే స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరకే లభిస్తాయే మనం ఇప్పుడు తెలుసుకుందాం. 



బిగ్ దసరా సేల్‌లో భాగంగా SAMSUNG Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే లభిస్తుంది. మొదట ఈ స్మార్ట్ ఫోన్ ను MRP ధర రూ. 24,499కు విక్రయించింది. అయితే ఆఫర్స్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ 32 శాతం తగ్గింపుతో రూ. 16, 499కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను బ్యాంక్ ఆఫర్స్ తో కొనుగోలు చేయడానికి ఎస్బిఐ క్రెడిట్ కార్డు వినియోగించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డును వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 14,999కే పొందవచ్చు.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు మరింత అతను తగ్గింపు పొందడానికి కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు RBL బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి కొనుగోలు చేసిన పై డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు కూడా 5% తగ్గింపును అందిస్తోంది.


ప్రస్తుతం ఈ మొబైల్ పై ఫ్లిఫ్‌కార్ట్‌ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంచింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించి SAMSUNG Galaxy F34 5G స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే లభిస్తుంది. అయితే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగుంటే రూ. 15,400 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.