COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy M14 5G Price Cut: అమెజాన్ తమ కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొన్ని మొబైల్‌పై ప్రత్యేకమైన డీల్స్‌ను అందిస్తుంది. ముఖ్యంగా ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ సాంసంగ్ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన కొన్ని మోడల్స్‌ను అమెజాన్ భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. అలాగే అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని మొబైల్ పై 20 నుంచి 30 శాతం తగ్గింపుతో విక్రయిస్తుండగా మరికొన్నిటిపై ఏకంగా 40 శాతం వరకు తగ్గింపుతో అందిస్తోంది. అయితే ఈ ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా మీరు కూడా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన సాంసంగ్ మొబైల్‌ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ మొబైల్ వివరాలు తప్పకుండా తెలుసుకోండి.


ఇటీవలే సాంసంగ్ కంపెనీ విడుదల చేసిన గెలాక్సీ m14 (Samsung Galaxy M14) మొబైల్ పై అమెజాన్ భారీ ఫ్లాట్ తగ్గింపుతో విక్రయిస్తోంది అలాగే ఈ మొబైల్ పై అదనపు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా కంపెనీ రెండు స్టోరేజ్ వేరియంట్లలో విక్రయిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.17,999 కాగా..అయితే ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి 31 శాతం తగ్గింపుతో కేవలం రూ.12వేల కే లభిస్తోంది. అలాగే దీనిపై అదనపు ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.


అదనపు ఆఫర్స్‌లో భాగంగా ఈ Samsung Galaxy M14 మొబైల్‌ను హెచ్డిఎఫ్సి(HDFC) బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు జే అండ్ కే బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించే వారికి కూడా సేమ్ తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే వన్ కార్డు క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లించే వారికి కూడా రూ.500 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను గెలాక్సీ m14 మొబైల్ రూ.11,850కే పొందవచ్చు. దీంతోపాటు అదనంగా మరింత తగ్గింపు పొందాలనుకునే వారికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా మీరు వినియోగిస్తున్న పాత బ్రాండెడ్ మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ.11 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఎక్స్చేంజ్ ఆఫర్ డిస్కౌంట్ పోను Samsung Galaxy M14 మొబైల్‌ను రూ.640కే పొందవచ్చు.


సాంసంగ్ గెలాక్సీ M14 స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ ఫీచర్స్‌:
1. 5G కనెక్టివిటీ:

13 5G బ్యాండ్‌లకు సపోర్ట్‌
భారతదేశంలో అన్ని ప్రధాన 5G నెట్‌వర్క్‌లతో పనిచేస్తుంది
వేగవంతమైన డౌన్‌లోడ్‌లు, స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్


2. శక్తివంతమైన ప్రాసెసర్:
5nm Exynos 1330 చిప్‌సెట్
మెరుగైన పనితీరు మరియు శక్తి సామర్థ్యం
మల్టీటాస్కింగ్, గేమింగ్ కోసం సరైనది


3. భారీ బ్యాటరీ:
6000mAh బ్యాటరీ
సింగిల్ ఛార్జ్‌పై రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్
25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


4. ట్రిపుల్ కెమెరా సిస్టమ్:
50MP ప్రధాన కెమెరా
2MP డెప్త్ కెమెరా
2MP మాక్రో కెమెరా
అద్భుతమైన ఫోటోలు, వీడియోలను తీయడానికి సరైనది


5. పెద్ద డిస్‌ప్లే:
6.6-అంగుళాల FHD+ PLS డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్
స్పష్టమైన, స్పష్టమైన దృశ్యాలను అందిస్తుంది


6. ఇతర ఫీచర్స్:
128GB స్టోరేజ్
Android 13
4 సంవత్సరాల భద్రతా నవీకరణలు
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి