Samsung Galaxy M35 5G Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ఆగస్టు 6వ తేదీ నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే ను దృష్టిలో పెట్టుకొని నిర్వహించబోతున్నట్లు అమెజాన్ వెల్లడించింది అయితే ఈ సేల్‌లో భాగంగా కొన్ని రకాల వస్తువులపై 50 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది ముఖ్యంగా ఎలక్ట్రిక్ వస్తువులు అయితే ఈ సేల్‌లో డెడ్ ధరకే లభించబోతున్నాయి. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ టీవీలు రిఫ్రిజిరేటర్ లను కొనుగోలు చేసే వారికి అద్భుతమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి ఈ సేల్ ఎర్లీ గానే స్టార్ట్  కాబోతోంది. అంతేకాకుండా అమెజాన్ ఇప్పటికే సేల్ ప్రారంభం కాకముందే ఇప్పటికే కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై అత్యధిక డిస్కౌంట్ తో విక్రయిస్తోంది. అయితే ఏ మొబైల్ అత్యధిక తగ్గింపుతో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా Samsung Galaxy M35 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి అత్యధిక తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు అదనంగా ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్ మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌తో పాటు మూడు కలర్లలో అందుబాటులో ఉంది. మొదటి పేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లో లభిస్తుంది. ఇక చివరి వేరియంట్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. అయితే ఈ దీనిలో భాగంగా మొదటి వేరియంట్ మొబైల్‌ని కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన తగ్గింపు అందిస్తోంది. మార్కెట్లో ఈ మొబైల్ అసలు ధర MRP రూ.24,999 కాగా.. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి 18 శాతం తగ్గింపుతో కేవలం రూ.19,999కే పొందవచ్చు. 


అలాగే ఈ మొబైల్ పై అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌తో కొనుగోలు చేసే వారికి అత్యధిక తగ్గింపు పొందవచ్చు . అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి ఈఎంఐ ఆప్షన్ చూజ్ చేసుకొని పేమెంట్ చేసే వారికి రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి EMI ఆప్షన్ లేకుండా ఇదే క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా ఈ మొబైల్‌పై మూడు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి ఈ మొబైల్ డెడ్ చీఫ్ ధరలోనే లభిస్తుంది. 


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇక ఈ Samsung Galaxy M35 5G మొబైల్‌పై అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు ధరకి ఈ స్మార్ట్ ఫోన్‌ను పొందవచ్చు. దీనికోసం ముందుగా ఏదైనా బ్రాండ్‌కు సంబంధించిన మొబైల్‌ను అమెజాన్‌కి ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.18 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను రూ.599లోపే కొత్త మొబైల్‌ను పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకోవడానికి అమెజాన్ అధికారిక వెబ్ సైట్ సందర్శించాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.