Samsung Galaxy S23 Price: ప్రముఖ సాంసంగ్ కంపెనీ ఈ సంవత్సరంలో మరో సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. Galaxy S23 పేరుతో ఈ మొబైల్‌ విడుదల కాగా.. ఈ సిరీస్‌లో చాలా రకాల కొత్త ఫీచర్లను అందుబాటులో కి తీసుకువచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ రూ. 95,999లకు విడుదల చేసింది. కానీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూ.79,999లకే అమెజాన్‌ విక్రయిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఎలా కొనుగోల చేస్తే డెడ్‌ ఛీప్‌గా లభిస్తుందో, ఈ మొబైల్‌ ఫీచర్స్‌ ఏంటో మొత్తం వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఈ మొబైల్‌ నాలుగు కలర్స్‌, మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది. మొదటి వేరియంట్ విషయానికొస్తే Samsung Galaxy S23 Ultra 5G..దీని ధర రూ. 1,54,998 కాగా రెండవ వేరియంట్‌ సాంసంగ్ Galaxy S23 5G..ఇది ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 74,998 ధరతో లభిస్తోంది. 512 జిబి వేరియంట్‌ Galaxy S23 5G రూ. 1,04,999 అమెజాన్‌ అందుబాటులో ఉంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ ఆఫర్స్‌లో కొనుగోలు చేస్తే బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఈ మొబైల్‌ను HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 5,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంకులపై కూడా డిస్కౌంట్‌ ఆఫర్ అందుబాటులో ఉంది. 


Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?


ఈ Galaxy S23 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్స్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మీ పాత మొబైల్‌ ఎక్చేంజ్‌ చేసి కొనుగోలు చేస్తే రూ 38,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ అన్ని ఆఫర్లు పోను రూ. 31,998లకి లభిస్తుంది. ఇందులో ఇంతక ముందు సాంసంగ్‌ విడుదల చేసిన సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ కంటే ఇది భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా ఇదివరకు ఎప్పుడు చూడని ఫీచర్స్‌ కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. 


Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి