Samsung Galaxy S23 Ultra 5G మొబైల్ పై రూ. 44,000 పైగా డిస్కౌంట్.. ఎగబడి కొంటున్న జనాలు.!
Samsung Galaxy s23 Ultra 5g Discount In India: శాంసంగ్ గాలక్సీ S23 అల్ట్రా(Samsung Galaxy S23 Ultra 5G) స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఈ ఆఫర్ ని వినియోగిస్తే డిస్కౌంట్ పొందవచ్చు. ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.
Samsung Galaxy s23 Ultra 5g Discount In India: ప్రీమియం స్మార్ట్ ఫోన్లను అందించేందుకు శాంసంగ్ కంపెనీ ఎప్పుడు ముందు ఉంటుంది. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన శాంసంగ్ గాలక్సీ S23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra 5G)కి మార్కెట్లో మంచి గుర్తింపు లభించింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రీమియం రేంజ్ లో లభించడంతో వినియోగదారులు ఎక్కువగా కొనేందుకు ఇష్టపడుతున్నారు. మీరు కూడా ఈ మొబైల్ ని భారీ డిస్కౌంట్ తో కొనుగోలు చేయాలనుకుంటే.. తప్పకుండా ఈ ఆఫర్ ని వినియోగించండి. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ని ఈ కామర్స్ కంపెనీలు రూ. 1,24,999కి విక్రయిస్తున్నాయి. దీని అసలు ధర రూ.1,49,999 కాగా మార్కెట్ లోని సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ కామర్స్ కంపెనీలు డిస్కౌంట్తో ఈ మొబైల్ ను తక్కువ ధరకు అందిస్తున్నాయి.
Also read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా
శాంసంగ్ గాలక్సీ S23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra 5G) స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో కొనుగోలు చేస్తే..బ్యాంక్ ఆఫర్ రూ. 8,000 దాకా లభిస్తోంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 1,24,999 లకే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ దగ్గర ఉన్న పాత ఫోన్ను ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ. 32,950 దాకా ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తోంది. అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్లు వినియోగించినందుకు.. రూ 12,000 బోనస్ లభిస్తుంది. ఈ అన్ని ఆఫర్లు పోను ఈ మొబైల్ రూ.53, 000లకే కొనుగోలు చేయవచ్చు.
ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
శాంసంగ్ గాలక్సీ S23 అల్ట్రా(Samsung Galaxy S23 Ultra 5G) 12 GB Ram, 1 TB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తోంది. ఇక ప్రాసెసర్ విషయానికొస్తే..Snapdragon 8 Gen 2 కలిగి ఉంటుంది. ఫోన్‌లో 3088x1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల QHD + డైనమిక్ AMOLEDని అందుబాటులో ఉన్నాయి. ఇక కెమెరా విషయానికొస్తే.. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా పాటు అదనంగా 12 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్ కెమెరాలు లభించనున్నాయి. 45W బ్యాటరీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తుంది. ఇందులో మీరు 15W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా పొందుతారు.
Also read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook