Samsung Galaxy A04s సీరీస్ విజయవంతమైన సందర్భంగా Galaxy A05s పేరుతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్ కొత్త A-సిరీస్ ను భారతదేశంలో విడుదల చేసింది.  ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయిన సంగతి తెల్సిందే.  ఒకవేళ మీరు కానీ రూ. 15000ల లోపు మంచి బడ్జెట్ కొనలేకుంటే ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ఫోన్ లో పెద్ద స్క్రీన్.. శక్తివంతమైన బ్యాటరీ మరియు కెమెరా ఉన్నాయి. Samsung Galaxy A05s ధర మరియు ఫీచర్లను గురించి ఇపుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy A05s బ్యాటరీ.. 
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న 5,000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. సాఫ్ట్‌వేర్ విషాయానికి వస్తే.. రెండు సంవత్సరాల హామీతో కూడిన భవిష్యత్ OS అప్‌డేట్‌లతో పాటు.. నాలుగు సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లతో Android 13 ఆధారంగా OneUI 5.1ని అమలు చేస్తుంది.


Samsung Galaxy A05s కెమెరా.. 
Samsung Galaxy A05s మంచి కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ఈ కెమెరా ఫీచర్ ప్రపంచాన్ని విభిన్న కోణంలో క్లిక్ చేయటానికి అనుమతిస్తుంది. వెనక కెమెరా 50MP, మాక్రో లెన్స్ 2MP మరియు డెప్త్ యూనిట్ 2MP ఉండగా.. ముందు భాగంలో 13MP సెల్ఫీ స్నాపర్ ఉంది. Samsung Galaxy A05s స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉండగా..  దీనిని మైక్రో SD కార్డ్‌తో 1TB వరకు స్ట్రోరేజ్ కు సపోర్ట్ చేస్తుంది. 


Also Read: Allu Arjun: అసలు పుష్ప సినిమా కథ నేషనల్ అవార్డు టీం వారికి పూర్తిగా అర్థమైందా?


Samsung Galaxy A05s స్పెసిఫికేషన్స్: 
Samsung Galaxy A05s ఇన్ఫినిటీ-U నాచ్‌తో 6.7-అంగుళాల PLS LCD డిస్‌ప్లేతో వస్తుంది. పవర్ బటన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండగా.. ఫోన్ వాడే వారికి ఇది చాలా సురక్షితంగా ఉంటుంది 


Samsung Galaxy A05s ధర.. 
Samsung Galaxy A05s మూడు రంగులలో అద్నుబాటులో ఉంది. అవి.. లైట్ గ్రీన్.. లైట్ పర్పుల్ మరియు బ్లాక్ కలర్ లలో అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ధర రూ. 14,999, SBI క్రెడిట్ కార్డ్ ఉన్న వారికీ రూ. 1,000 తగ్గింపు ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌ను బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్, శామ్‌సంగ్ స్టోర్‌లు మరియు రిటైలర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.


Also Read: పండుగ సీజన్‌ సేల్‌ ప్రారంభం..43, 55, 65 అంగుళాల టీవీలపై 50% వరకు తగ్గింపు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..