Best Power Bank: ఎప్పటినుంచో మంచి పవర్ బ్యాంకు ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ ముందుకు Shargeek 170 పవర్ బ్యాంక్ వచ్చేసింది. ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ పవర్ బ్యాంకును కిక్‌స్టార్టర్ 2023 అక్టోబర్‌లో లాంచ్ చేయగా..శనివారం మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే కొన్ని వేల బ్యాంకులో అమ్మకాలు జరిపినట్లు కంపెనీ వెల్లడించింది. ఇతర పవర్ బ్యాంక్స్‌తో పోలిస్తే ఇది 50 రేట్లు ఎంతో మన్నికగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే ఈ పవర్ బ్యాంకుకు సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతి శక్తివంతమైన అవుట్‌పుట్‌:
ఈ Shargic 170 ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా గరిష్టంగా 170W పవర్ అవుట్‌పుట్‌తో ఒకేసారి మూడు పరికరాలను ఛార్జ్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు రెండు PD 3.1 టూ-వే USB-C పోర్ట్‌లు 140W వరకు ఛార్జింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఒకవేళ రెండు USB-C పోర్ట్‌లు వినియోగిస్తే.. 65W పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఈ Shargic 170 పవర్‌ బ్యాంక్‌ మూడు పోర్ట్‌లను వినియోగిస్తే మొదటి USB-C పోర్ట్  65W పవర్, మిగిలిన రెండు పోర్ట్‌లు 18W వరకు అవుట్‌పుట్‌ను అందిస్తాయి. 


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


24000 mAh బ్యాటరీతో..
shargeek 170 పోర్టబుల్ పవర్‌బ్యాంక్ 24000mAh బ్యాటరీని కలిగి ఉందని కంపెనీ తెలిపింది. దీంతో పాటు ఈ పవర్‌ బ్యాంక్‌ EV-గ్రేడ్ రేటింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త పవర్ బ్యాంక్‌తో iPhone 14 Proని ఆరుసార్లు లేదా MacBook Pro/ROG Allyని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తుంది. దీంతో పాటు 140W వరకు పాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీనితో చార్జ్‌ చేసుకునేవారు కేవలం 20 నిమిషాల్లో 0 నుంచి 50% వరకు ఛార్జింగ్ పొందవచ్చు. అంతేకాకుండా ఈ పవర్‌బ్యాంక్‌ బ్యాటరీ లైఫ్, అవుట్‌పుట్ పవర్, లో పవర్‌ మోడ్‌లను ఇండికేట్‌ చేయడానికి డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇది IP66 వాటర్ రెసిస్టెంట్, ప్రీమియం డిజైన్‌తో లభిస్తోంది. ఈ పవర్‌ బ్యాంక్‌ బరువు 680 గ్రాముల బరువు, 6.5 అంగుళాలు పొడవు కలిగి ఉండడం వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్ల వచ్చు. 


ధర వివరాలు:
పలువురు టిప్‌స్టర్‌లు తెలిపిన వివరాల ప్రకారం..ఈ షార్జిక్ 170 పవర్‌ బ్యాంక్‌ ధర $119 (దాదాపు రూ. 10 వేలు) ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షార్జిక్ కంపెనీ  అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా దేశాల్లో విక్రయిస్తోంది. అయితే ఈ పవర్‌ బ్యాంక్‌ను కంపెనీ త్వరలోనే భారత్‌లో విడుదల చేసేందుకు యోచిస్తోంది. 


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter