Smartphone Discount Offer: అమెజాన్‌లో iQOO Z9s 5G మొబైల్‌పై రూ.2,225 డిస్కౌంట్.. డెడ్ చీప్ ధరకే కొత్త ఫోన్!
Smartphones Under 20000: అత్యధిక తగ్గింపు ధరతో iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఈ మొబైల్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Smartphones Under 20000: ప్రస్తుతం మార్కెట్లో AMOLED డిస్ప్లేతో కూడిన స్మార్ట్ ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎప్పటికప్పుడు ఇలాంటి డిస్ప్లే లతోనే మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన చాలా స్మార్ట్ ఫోన్స్ AMOLED డిస్ప్లే తో వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లోని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఇలాంటి డిస్ప్లే లతో కూడిన మొబైల్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ను అందిస్తోంది. ఈ సేల్ లో భాగంగా ఇటీవలే ఇదే డిస్ప్లే తో విడుదలైన iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుంది. దీనిపై అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఈ iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ అనేక రకాల శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం డైమెసిటీ 7300 5G ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన కెమెరా సెట్ అప్‌తో అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్‌లో 128gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.26 వేలు అయినప్పటికీ.. దీనిని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఏకంగా 23 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులను వినియోగించి ఈ మొబైల్ ను కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో SBI బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి ఏకంగా అమెజాన్ రూ.2,225 వరకు తగ్గింపు అందిస్తుంది. అంతేకాకుండా ఇదే బ్యాంకుకు సంబంధించిన డెబిట్ కార్డును వినియోగించి కూడా ప్రత్యేకమైన తగ్గింపును పొందవచ్చు. అలాగే అమెజాన్ ఇదే బ్యాంకుతో కాకుండా దీని అనుసంధాన ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లించే వారికి కూడా ఏకంగా రూ.999 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి EMI ఆప్షన్ చూస్ చేసుకొని కొనుగోలు చేసే వారికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభిస్తుంది. అదేవిధంగా ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఈ iQOO Z9s 5G మొబైల్ పై ఉన్న ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా మీరు వినియోగిస్తున్న పాత మొబైల్‌ను అమెజాన్‌కి ఎక్స్చేంజ్ చేసి దాదాపు రూ.18 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే ఈ బోనస్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే పాత మొబైల్ కండిషన్, దాని బ్రాండ్ పై ఆధారపడి ఉంటుంది. ఎక్స్చేంజ్ చేసే పాత మొబైల్ కండిషన్ బాగుంటేనే పై బోనస్ లభిస్తుందని అమెజాన్ క్లుప్తంగా పేర్కొంది. ఎలాంటి డెట్స్, స్క్రాచెస్ లేని మొబైల్ పై ఫుల్ ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అదే ఒకవేళ మీ మొబైల్ డ్యామేజ్ అయి ఉన్నట్లయితే ఎక్స్చేంజ్ బోనస్‌లో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.