Moto Edge Edge 30 Fusion Special Edition: ప్రస్తుతం చాలా మంది మొబైల్‌ ఫోన్స్‌ కెమెరాల కోసం కొంటున్నారు. కెమెరా క్వాలిటీలను బట్టి ఫోన్‌లకు వినియోగదారులు డబ్బులను కేటాయిస్తున్నారు. అయితే ఇటీవలే చాలా ప్రీమియం కెమెరా కలిగిన ఫోన్స్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యాయి. ఇటీవలే విడుదలైనా మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేక ఎడిషన్‌ను విడుదలకు సిద్దమైంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు దీని సేల్ ప్రారంభం కానుంది. అయితే ఈ ఫోన్‌ను మొదటి సేల్‌లోనే తీసుకుంటే చాలా తక్కువ ధరకే, భారీ డిస్కౌంట్‌తో లభించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Motorola కొత్త స్మార్ట్‌ఫోన్ సెల్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విక్రయం కానుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ను  రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ల నుంచి కూడా కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ రంగు, డిజైన్ మాత్రమే మారుతుంది. మిగితవన్ని ఒరిజినల్ ఎడ్జ్ 30 ఫ్యూజన్ మాదిరిగానే ఉంటాయి. ఇక కలర్స్‌ విషయానికొస్తే కాస్మిక్ గ్రే, సోలార్ గోల్డ్‌తో అందుబాటులోకి రానున్నాయి.


ఈ ఫోన్‌పై మొదటి సేల్‌లో బంపర్ డిస్కౌంట్‌ ఆఫర్‌:
మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ భారత మార్కెట్‌లో రూ. 42,999 కాగా.. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూ. 39,999లకే అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. అంతేకాకుండా దీనిని ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే  రూ. 3,500 తక్షణ క్యాష్‌బ్యాక్ లభించనుంది. అంతేకాకుండా రూ. 7,699 విలువైన జియో బెనిఫిట్స్‌ కూడా పొందొచ్చు.


మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్(Moto Edge 30 Fusion Viva Magenta) స్పెసిఫికేషన్స్‌:
144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లే
1100nits పీక్ బ్రైట్‌నెస్
HDR10+ సపోర్ట్‌
Qualcomm Snapdragon 888+ ప్రాసెసర్‌
8GB RAM+128GB
డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌
Dolby Atmos సపోర్ట్‌
బ్యాక్‌ ప్యానెల్ 50MP కెమెరా
13MP అల్ట్రా-వైడ్ లెన్స్
డెప్త్ సెన్సార్‌
32MP ఫ్రంట్ కెమెరా
4400mAh బ్యాటరీ
68W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్


Also Read: Ind Vs SL: సిరీస్‌ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..! 


Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి