TECNO CAMON 30: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. TECNO CAMON 30 Series నుంచి CAMON 30 ప్రీమియర్ ఫోన్ ఇది. ఫీచర్లు, కెమేరా, ర్యామ్ చూస్తే వదిలిపెట్టరు. డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మరో నాలుగు రోజుల్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TECNO CAMON 30 మోడ్రల్ డిజైన్, అద్భుతమైన ఫీచర్లు, త్రిబుల్ కెమేరా సెటప్ తో లాంచ్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్పీటీవో ఎమోల్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8 జనరేషన్ చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వి5 అమర్చారు. లావా బ్లాక్, స్నోయీ సిల్వర్ రంగుల్లో లభ్యమౌతుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్ 5.2 సపోర్ట్ చేస్తుంది. వైఫై 5 ఆధారంగా పనిచేస్తుంది. బ్యాటరీ 5000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. 


అన్నింటికీ మించి ర్యామ్, కెమేరా ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇందులో త్రిబుల్ కెమేరా సెటప్ కలిగి ఉండటం విశేషం. మూడు కెమేరాలు కూడా 50 మెగాపిక్సెల్ కావడం మరో విశేషం. 50 మెగాపిక్సెల్ f/1.88 వైడ్ యాంగిల్ ప్రైమ్ కెమేరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమేరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమేరా ఉన్నాయి. ఈ మూడింటికీ తోడు సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం మరో 50 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. 


ర్యామ్ అయితే 24 జీబీ వరకూ ఉంటుంది. అంటే చాలా వేగంగా పనిచేయగలదు. ఇందులో 8జీబీ ర్యామ్, 12 జీబీ ర్యామ్, 24 జీబీ ర్యామ్ వరకూ ఉంది. స్టోరేజ్ అయితే అత్యధికంగా 512 జీబీ వరకూ ఉండటం గమనార్హం. ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ కలిగిన TECNO CAMON 30 ఫోన్ 22,999 రూపాయలు కాగా ఇందులోనే 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ అయితే 26,999 రూపాయలుంది. ఇందులోనే 512 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగిన ఫోన్ అయితే 36,999 రూపాయలుంది. మే 23 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్‌పై 3 వేల నుంచి 5 వేల వరకూ అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆఫర్లు అన్నీ కలుపుకుంటే ప్రారంభ ధర కేవలం 19 వేలే ఉంటుంది. 


Also read: Tatkal Passport: తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook