Tecno Pop 8 Vs Infinix Smart 8: ఈ 2 మొబైల్స్‌లో ఏది బెస్టో తెలుసా?..ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పరంగా ఇదే బెస్ట్..
Tecno Pop 8 Vs Infinix Smart 8 Compairison: అతి తక్కువ ధరలో లభించే Tecno Pop 8, Infinix Smart 8 5G మొబైల్స్‌లో ఏది కొనుగోలు చేయాలో తికమక పడుతున్నారా? అయితే మీ కోసం వీటి కంపైరిజన్ ఇప్పుడు తెలుసుకుందాం.
Tecno Pop 8 Vs Infinix Smart 8 Compairison: ప్రస్తుతం మార్కెట్‌లో ప్రీమియం ఫీచర్స్‌తో చాలా బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్ అతి తక్కువ ధరలో లాంచ్ అయ్యాయి. చాలా మంది యువత ఇలాంటి స్మార్ట్ ఫోన్స్‌నే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో Tecno Pop 8తో పాటు Infinix Smart 8 5G మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించింది. దీంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తేందుకు మెగ్గు చూపుతున్నారు. అయితే మీరు కూడా ఈ రెండింటిలో ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పరంగా బెస్ట్ ఉండే మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీరే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌లో ఏది బెస్టో తెలుసుకోండి.
Tecno Pop 8 Vs Infinix Smart 8 5G ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
మొదట Tecno Pop 8 స్మార్ట్ ఫోన్ వివరాల్లోకి వెళితే..ఇది 4GB ర్యామ్‌తో మార్కెట్‌లో లభిస్తోంది. దీంతో పాటు 6.56 అంగుళాల(16.66 సెం.మీ.) డిస్ల్పేను కలిగి ఉంటుంది. బ్యాక్ సెటప్‌లో ఈ మొబైల్ 12 MP ప్రధాన బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఫ్రంట్‌లో 8 MP సెల్పీ కెమెరాతో అందుబాటులో ఉంది. ఇక Infinix Smart 8 5G మొబైల్ వివరాల్లోకి వెళితే..ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 3GB ర్యామ్ సెటప్‌తో లభిస్తోంది. అలాగే ఇది 6.56 అంగుళాల(16.66 సెం.మీ.) డిస్ల్పేతో లభిస్తోంది. ఈ మొబైల్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. ఇది 13MP + 0.08MP కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఫ్రంట్‌లో 8 ఎంపి కెమెరాతో లభిస్తోంది.
ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ 5000 mAh బ్యాటరీతో అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు Tecno Pop 8 మొబైల్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ స్టోరేజ్‌ను 1 TB వరకు విస్తరించుకునేందుకు ప్రత్యేక మెమోరీ స్లాట్‌ను కూడా అందిస్తోంది. ఇక Infinix Smart 8 విషయానికొస్తే..ఇది 64 GB స్టోరేజ్‌తో రాబోతోంది. ఈ మొబైల్‌లో అదనంగా 2 TB వరకు స్టోరేజ్‌ను పెంచుకునేందుకు ప్రత్యేక ఫీచర్‌ను కూడా అందిస్తోంది. నిపుణులు అందించిన రేటింగ్ ప్రకారం, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌కి 7.0/10గా రేటింగ్ ఇచ్చారు. ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ v13పై రన్ అవుతాయి. ఇవి యునిసోక్ T606 చిప్‌సెట్, ఆక్టా కోర్(1.6 GHz, డ్యూయల్ కోర్, కార్టెక్స్ A75 + 1.6 GHz, హెక్సా కోర్, కార్టెక్స్ A55)పై పని చేస్తాయి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
ఈ Tecno Pop 8 స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం మిస్టరీ వైట్, ఆల్పెంగ్లో గోల్డ్, గ్రావిటీ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇక Infinix Smart 8 5G మొబైల్ షిన్నీ గోల్డ్, గెలాక్సీ వైట్, క్రిస్టల్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తోంది. ఇక కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే టెక్నో మొబైల్ 12 MP f/1.85, వైడ్ యాంగిల్ కెమెరాతో అందుబాటులో ఉండగా Infinix మొబైల్ 13 MP, వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరాతో లభిస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్స్‌లో డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్ ఫీచర్స్ లభిస్తున్నాయి. ఇక ధరల విషయానికొస్తే..టెక్నో పాప్ 8 స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో రూ. 6,499తో అందుబాటులో ఉండగా..Infinix Smart 8 HD మొబైల్ రూ. 6,229తో లభిస్తోంది. ఫీచర్స్, అన్నింటి పరంగా Tecno Pop 8 స్మార్ట్ ఫోన్ బెస్ట్..
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter