Tecno Spark 20 Pro Price: ప్రముఖ టెక్‌ బ్రాండ్‌ టెక్నో(Tecno) మరో స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను టెక్నో స్పార్క్ 20 ప్రో(Tecno Spark 20 Pro) పేరుతో కంపెనీ విడుదల చేసింది. ఈ మొబైల్‌ పిచ్చెక్కించే లుక్‌తో 8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్‌లో విడుదల చేసింది. అతి తక్కువ ధరలోనే సెల్ఫీ కోసం కంపెనీ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్‌గా ఈ మొబైల్‌ లభించబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ టెక్నో స్పార్క్ 20 ప్రో(Tecno Spark 20 Pro) మొబైల్‌ 108 మెగాపిక్సెల్స్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ను అందించే డిస్ల్పేతో లభించనుంది. ఈ మొబైల్‌  మూన్‌లిట్ బ్లాక్, ఫ్రోస్టీ ఐవరీ, సన్‌సెట్ బ్లష్, మ్యాజిక్ స్కిన్ నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు చాలా రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లో అందుబాటులో రానుంది. 


ఫీచర్‌లు, స్పెసిఫికేషన్స్‌ పూర్తి వివరాలు:
టెక్నో స్పార్క్ 20 ప్రో ఆకర్శనీయమైన పంచ్-హోల్ డిజైన్‌తో 6.78 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయడమే కాకుండా  8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రాబోతోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ Mali G57 MP2 GPUతో ఆక్టా-కోర్ Helio G99 చిప్‌సెట్‌పై పని చేస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్‌ డబుల్‌ కెమెరా సెటప్‌, డ్యూయల్ LED ఫ్లాష్‌ను కలిగి ఉంటుంది. 


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


ఈ మొబైల్‌ ప్రధాన కెమెరా 108-మెగాపిక్సెల్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెకండరీ లెన్స్ 0.08-మెగాపిక్సెల్‌తో రాబోతోంది. సెల్ఫీ, వీడియో కాలింగ్‌ కోసం కంపెనీ ఈ స్మార్ట్‌  32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. అలాగే 5000mAh బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.  ఇక OS విషయానికొస్తే..ఈ స్మార్ట్ ఫోన్‌ Android 13పై పని చేస్తుంది. ఇక సెక్యూరుటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో రాబోతోంది.  


కనెక్టివిటీ స్పెషిఫికేషన్స్‌ విషయానికొస్తే..ఈ స్మార్ట్ ఫోన్‌ డ్యూయల్ సిమ్ సపోర్ట్, 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n/ac, బ్లూటూత్, GPS ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు USB టైప్-సి పోర్ట్ కూడా లభిస్తోంది. అయితే కంపెనీ ఈ టెక్నో స్పార్క్ 20 ప్రో(Tecno Spark 20 Pro) స్మార్ట్ ఫోన్‌ను ఫిలిప్పీన్స్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ధర విషయానికొస్తే..మార్కెట్‌లో ధర PHP 5599 (సుమారు రూ. 8,400)లతో విక్రయిస్తోంది.


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి