Best Laptops: అద్బుతమైన ఫీచర్లు, కాన్ఫిగరేషన్‌తో తక్కువ ధరకు టాప్ ల్యాప్‌టాప్‌లు ఇవే
Best Laptops: మార్కెట్‌లో చాల రకాల ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కాన్పిగరేషన్, కంపెనీ బట్టి ల్యాప్‌టాప్ ధర మారిపోతుంటుంది. మీరు కూడా ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తుంటే మీకోసం అనువైన ల్యాప్‌టాప్‌ల వివరాలు అందిస్తున్నాం.
Best Laptops: ల్యాప్‌టాప్ కొనేముందు రెండు విషయాలు తప్పకుండా పరిశీలించాలి. ఒకటి కాన్ఫిగరేషన్ రెండు కంపెనీ. ఇక బడ్జెట్ అనేది ఎవరికి సామర్ధ్యాన్ని బట్టి వారికి ఉంటుంది. అదే సమయంలో మార్కెట్‌లో తక్కువ బడ్జెట్‌లో మంచి కాన్ఫిగరేషన్ కలిగిన ల్యాప్‌టాప్‌లు చాలా ఉన్నాయి అవేంటో తెలుసుకుంటే ల్యాప్‌టాప్ కొనుగోలు సులభమైపోతుంది.
అనువైన ధరలో మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కలిగిన ల్యాప్‌టాప్ ఎంచుకోవడం కష్టమౌతుంటుంది. ఎందుకంటే కాన్ఫిగరేషన్ , కంపెనీ రెండూ బాగుండాలి. మన వృత్తిని బట్టి చేసే పనిని బట్టి ల్యాప్‌టాప్ కాన్ఫిగరేషన్ మార్చుకోవల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ మీ కోసం ఎంఎస్ఐ, లెనోవో, ఏసర్ వంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌ల వివరాలు, ధర, ఫీచర్లు అందిస్తున్నాం. ఈ ల్యాప్‌టాప్‌లు విద్యార్ధులు, వ్యాపారులకైతే సరిగ్గా సరిపోతాయి.
Jio Book 11
జియో బుక్ 11 ల్యాప్‌టాప్ బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్ అని చెప్పవచ్చు. ఇది 11.60 ఇంచెస్ ఉంటుంది. హెచ్‌డి యాంటీ గ్లేర్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ చాలా లైట్ వెయిట్. కేవలం 990 గ్రాములే ఉంటుంది. ఆక్టాకోర్ మీడియా టెక్ ఎంటీ 8788 సీపీయూతో పనిచేస్తుంది. ఇదులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంటుంది. 256 జీబీ వరకూ పెంచుకోవచ్చు. అదే విధంగా ర్యామ్ కూడా పెంచుకునేందుకు ఆస్కారముంటుంది. ర్యామ్ పెరిగే కొద్ది ల్యాప్‌టాప్ స్పీడ్ పెరుగుతుంది. జియో ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేస్తుంది. అమెజాన్ ఈ కామర్స్‌లో జియో బుక్ 11 ల్యాప్‌టాప్ 14,701 రూపాయలకు లభిస్తుంది.
HP Chrome Book X360 Intel Celeron N4120
మార్కెట్‌లో అతి తక్కువ ధరకు లభిస్తున్న అత్యంత శక్తివంతమైన ల్యాప్‌టాప్ ఇది. 14 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. బ్యాటరీ లైఫ్ 12 గంటలుంటుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 స్టోరేజ్ ఉంటుంది. అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్స్‌కు పనిచేస్తుంది. దీన్నొక ప్రొఫెషనల్ ల్యాప్‌టాప్‌గా ఉపయోగించవచ్చు. ఎందుకంటే డాక్యుమెంట్లు, ప్రజంటేషన్లకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ యాడ్స్ ఉంటాయి. అమెజాన్ ఆన్‌లైన్ సైట్‌లో కేవలం 28,389 రూపాయలకే లభిస్తోంది.
MSI Modern 15
ఎంఎస్ఐ ల్యాప్‌టాప్ అనేది హై ఎండ్ ల్యాప్‌టాప్ విభాగంలో అత్యంత అనుకూలమైన ధరకు లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉండటం వల్ల పనితీరు చాలా బాగుంటుంది.దీనికితోడు 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3-1115 జి4 ప్రోసెసర్, ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్ కార్డ్ ఉంటాయి. దాంతో గ్రాఫిక్ డిజైనర్లకు సైతం ఈ ల్యాప్‌టాప్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో 180 డిగ్రీల లే ఫ్లాట్ అండ్ ఫ్లిప్ ఇన్ షేర్ ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్ సహాయంతో సులభంగా స్క్రీన్ షేర్ వీలవుతుంది. ఇదే ఫీచర్లు కలిగిన డెల్ లేదా హెచ్‌పి లేదా ఏసర్ ల్యాప్‌టాప్ మార్కెట్‌లో 50-70 వేల వరకూ ఉంటుంది. కానీ ఈ ల్యాప్‌టాప్ మాత్రం కేవలం 34,490 రూపాయలకే అమెజాన్‌లో లభ్యమౌతోంది.
Acer Asphire 3 Laptop AMD Raisen 3
ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. ఏఎండీ రైజన్ 3-7320 యు ప్రోసెసర్, ఏఎండీ రేడియన్ గ్రాఫిక్స్ ఉండటం వల్ల ప్రొఫెషనల్ ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. యాంటీ గ్లేర్ కావడంతో కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇందులో 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ధర అమెజాన్‌లో 36,990 రూపాయలుంటుంది.
Lenovo Idea pad Slim 3
ఇదొక మల్టీ టాస్కింగ్ ల్యాప్‌టాప్. ఇది 11వ జనరేషన్, ఇంటెల్ కోర్ ఐ3-1115 జీ4 ప్రోసెసర్ కలిగి ఉంటుంది. విండోస్ 10 ఆధారంగా పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 15.60 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి ఉటుంది. 8జీబీ ర్యామ్, 512 జీబీ మెమరీతో పాటు 10 గంటల బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ అటు గ్రాఫిక్ డిజైనర్లు, ఎడిటర్లు, ఇంజనీర్లు అందరికీ బాగా పనిచేస్తుంది. ఈ ల్యాప్‌టాప్ అమెజాన్‌లో కేవలం 43,990 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.
Also read: Apple iPhone 16: ఐపోన్ ప్రియులకు గుడ్‌న్యూస్, కొత్తగా బటన్ కెమేరా ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook