COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Upcoming Phones In February 2024: మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేసుకున్నవారికి శుభ వార్త..అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కొన్ని టెక్‌ కంపెనీలకు చెందిన మొబైల్స్‌ విడుదల కాబోతున్నాయి. అయితే అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా.. ఫిబ్రవరి నెల రెండవ వారం వరకు వేచి ఉండడాల్సి ఉంటుంది. ప్రీమియం కేటగిరీలకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌లు అతి తక్కువ ధరలోనే లభించనున్నాయి. ఇందులో రెడ్‌మీ, హానర్, సాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


1. iQOO Neo 9 Pro:
ప్రముఖ టెక్‌ కంపెనీ iQOO త్వరలోనే Neo 9 Pro మోడల్‌ను విడుదల చేయబోతంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఫిబ్రవరి 22న భారతదేశంలో లాంచ్‌ చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది  స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో పాటు 12GB ర్యామ్‌తో రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది.  ఇక ఈ మొబైల్‌ ధర విషయానికొస్తే..రూ. 40,000 కంటే తక్కువలోనే లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


2. నథింగ్ ఫోన్ 2A:
ప్రముఖ చైనీస్‌ కంపెనీ నథింగ్ ఫిబ్రవరి నెలలో నథింగ్ ఫోన్ 2A స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఫిబ్రవరి 26 నుంచి 29 మధ్య జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో భాగంగా ఈ మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మొబైల్‌  32 MP ఫ్రంట్ కెమెరాతో పాటు  120 Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 50 MP కెమెరా బ్యాక్‌ కెమెరా సెట్‌తో రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ.35,000 ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.


3. Honor X9b:
ఈ నెలలో హానర్ నుంచి కూడా స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది కంపెనీ X9b మోడల్ విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత శక్తివంతమైన డిస్ప్లే తో పాటు అనేక రకాల అధునాతన ఫీచర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతోంది. మొదటగా ఈ మొబైల్ ను కంపెనీ 12GB RAM, 256GB స్టోరేజ్‌ వేరియంట్లలో లభించనుంది. ఈ Honor X9b ధర రూ. 30,000లోపే ఉండబోతున్నట్లు సమాచారం.


4. Vivo V30 5G:
వివో నుంచి కూడా ఫిబ్రవరి నెలలో అతి శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. అందరూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న Vivo V30 5G స్మార్ట్ ఫోన్ ను కంపెనీ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 3 డి కర్వ్డ్ డిస్‌ప్లే, 12 జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ తో విడుదల చేయబోతోంది. అయితే ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ధర రూ. 30,000 మార్కెట్లోకి విక్రయించబోతున్నట్లు తెలిపింది.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


5. హానర్ మ్యాజిక్ 6 సిరీస్:
ఫిబ్రవరి నెలలోని రెండవ వారం హానర్ మ్యాజిక్ 6 సిరీస్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ మ్యాజిక్ V2ని MWC 2024లో పరిచయం చేయబోతున్నట్లు తెలిపింది. ఈ సీరీస్ ను ఫిబ్రవరి 25న లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.


Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter