VIVO T3 Pro Launch: VIVO కంపెనీ నుంచి కొత్తగా VIVO T3 Pro లాంచ్ అయింది. వివో టి సిరీస్ లైనప్‌లో వచ్చిన కొత్త మోడల్ ఇది. అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7వ జనరేషన్ చిప్‌సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమేరా వంటి చాలా ఫీచర్లు ఉన్నాయి. అందుకే ఈ ఫోన్‌పై మార్కెట్‌లో అంచనాలు చాలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIVO T3 Pro అనేది 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ 3డి కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. 45009 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. అంతేకాకుండా రోబస్ట్ స్కాట్ సెన్సేషన్ గ్లాస్‌తో స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటుంది. దాంతో వెట్ టచ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అంటే తడి చేతులతో కూడా ఫోన్ ఆపరేట్ చేసేందుకు వీలవుతుంది. ఈ ఫోన్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7వ జనరేషన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్‌తో పనిచేస్తుంది. ఇందులో 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. 


డ్యూయల్ సిమ్ కలిగిన్  VIVO T3 Pro ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా కాగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా ఉంటుంది. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఇక ఈ ఫోన్ 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉండటమే కాకుండా 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 


VIVO T3 Pro 8జిబి ర్యామ్-128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర  24,999 రూపాయలు కాగా ఇందులోనే 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ అయితే 26,999 రూపాయలు ఉంటుంది. ఇందులో శాండ్ స్టోన్ ఆరెంజ్, ఎమెరాల్డ్ గ్రీన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై కొనుగోలు చేస్తే 3000 రూపాయలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఎక్స్చేంజ్ బోనస్ కింద మోర 3 వేలు ఆఫర్ ఉంటుంది. నో కాస్ట్ ఇఎంఐ ఆరు నెలలకు లభిస్తుంది.


Also read: iPhone 16 Launch: ఐఫోన్ 16 లాంచ్ తేదీ వచ్చేసింది, సెప్టెంబర్ 9వ తేదీన 4 మోడల్స్ ఆవిష్కరణ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook