iPhone 16 Launch: ఐఫోన్ 16 లాంచ్ తేదీ వచ్చేసింది, సెప్టెంబర్ 9వ తేదీన 4 మోడల్స్ ఆవిష్కరణ

iPhone 16 Launch: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 లాంచ్ తేదీ వచ్చేసింది. సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 నాలుగు మోడల్స్‌లో లాంచ్ కానున్నాయి. ఐఫోన్ 16 ఫీచర్లు, ధర ఇతర వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 28, 2024, 05:57 PM IST
iPhone 16 Launch: ఐఫోన్ 16 లాంచ్ తేదీ వచ్చేసింది, సెప్టెంబర్ 9వ తేదీన 4 మోడల్స్ ఆవిష్కరణ

iPhone 16 Launch: ప్రతి ఏటా సెప్టెంబర్ నెల సమీపిస్తుందంటే ఆపిల్ ప్రేమికులకు పండుగే. ఆపిల్ కొత్త సిరీస్ సెప్టెంబర్ నెలలో లాంచ్ అవుతుంటుంది. ఈసారి ఐఫోన్ 16 సెప్టెంబర్ 9వ తేదీన లాంచ్ చేయాలని ఆపిల్ నిర్ణయించింది. ఆపిల్ పాత మోడల్స్‌కు భిన్నంగా కొత్త ఫీచర్లతో ఐఫోన్1 6 నాలుగు మోడల్స్ రానున్నాయి. ఇందులో కొత్త ఫీచర్లు కన్పించనున్నాయి. 

ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 16 సిరీస్ ఆవిష్కృతం చేయనుంది. కొత్త ఫీచర్లు, కొత్త స్పెసిఫికేషన్లు ఇప్పటికే కొన్ని లీక్ అయ్యాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మోడల్స్‌పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ రెండు సైజుల్లో లభ్యం కానుంది. ఐఫోన్ 16 అయితే 6.1 అంగుళాలు, ఐఫోన్ 16 ప్లస్ 6.7 అంగుళాలతో మార్కెట్‌లో రానుంది. ఐఫోన్ 15 ప్రో మోడల్‌లో ప్రవేశపెట్టిన యాక్షన్ బటన్ ఐఫోన్ 16 అన్ని మోడల్స్‌లో మ్యూట్ స్విచ్‌గా మారనుంది. ఫ్లాష్ లైట్, లాంచింగ్ కెమేరా, ట్రిగ్గరింగ్ షాట్‌కట్స్ కోసం కస్టమైజ్డ్ బటన్ పనిచేయనుంది. 

ఐఫోన్ 16 మోడల్స్‌లో కెమేరా సెటప్ ఈసారి వెర్టికల్‌గా ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ సెటప్ డయాగోనల్‌గా ఉంటుంది. ఆపిల్ విజన్ ప్రో హెడ్‌సెట్ ప్రత్యేక వీడియో రికార్డింగ్‌కు ఇది దోహదపడుతుంది. ఐఫోన్ 16 మోడల్స్‌లో ఏ18 చిప్ ఉంటుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడల్స్‌లో ర్యామ్ కూడా 6 జీబీ నుంచి 8జీబీకు మారుతుంది. దీంతోపాటు వైఫై 6ఇతో పనిచేస్తుంది. ఐపోన్ 16 ప్రో 6.3 ఇంచెస్ ఉండవచ్చు. ఐఫోన్ ప్రో మ్యాక్స్ అయితే 6.9 ఇంచెస్ ఉంటుంది. 

ఐఫోన్ 16లో కొత్తగా క్యాప్చర్ బటన్ ఉంటుంది. ఇది కెమేరాకు అంకితమై ఉంటుంది. కెమేరా అయితే 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరాతో ఉంటుంది. ప్రో మ్యాక్స్‌లో 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటాయి. 

Also read: Jio OTT Offers: జియో ప్రీ పెయిడ్ ప్లాన్‌తో 13 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News