Vivo Latest Phones: వివో నుంచి 16జీబీ ర్యామ్, 200MP కెమేరాతో మూడు ఫోన్లు, దిమ్మతిరిగే ఫీచర్లు
Vivo Latest Phones: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి కొత్తగా మూడు వేరియంట్స్ లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లు ఏకంగా 200 మెగాపిక్సెల్ కెమేరా, 16జీబీ ర్యామ్‌తో వస్తున్నాయంటే ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vivo Latest Phones: వివో స్మార్ట్‌ఫోన్ కంపెనీ నుంచి కొత్తగా Vivo X100 Ultra,Vivo X100S,Vivo X100S Pro పేర్లతో మూడు ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. చైనా సోషల్ మీడియాలో వీటికి సంబంధించి ఫోటోలు షేర్ అయ్యాయి. ఈ ఫోన్ల వెనుకవైపు వృత్తాకార మాడ్యూల్స్‌లో మూడు ప్రత్యేక కెమేరాలు కన్పిస్తున్నాయి.
Vivo X100 Ultra, Vivo X100S, Vivo X100S Pro ఫోన్లు మే 13వ తేదీన చైనాలో లాంచ్ కానున్నాయి. అదే రోజు నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. మే 28 నుంచి మార్కెట్‌లో అమ్మకాలు జరగనున్నాయి. ఇందులో మూడు వేరియంట్లు మూడు ర్యామ్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్, 16జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్-1టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. వివో ఎక్స్ 100 అల్ట్రా అనేది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో ఏకంగా 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ కెమేరా సహా మరో రెండు సెన్సార్ కెమేరాలుంటాయి.
వివో స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఎడిటింగ్ ఫీచర్లు కస్టమర్లను ఇట్టే ఆకట్టుకోనున్నాయి. ఇందులో బ్యాక్ ప్యానెల్‌లో వృత్తాకారంలో నాలుగు కెమేరా హోల్స్ కన్పిస్తాయి. ఫోన్ అంచులు కొద్దిగా కర్వ్డ్‌గా ఉంటాయి. వివో కంపెనీ వి సిరీస్‌లో భాగంగా వివో వి30ఇను ఇటీవలే ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో కూడా బ్యాక్ ప్యానెల్‌లో వృత్తాకారంలో 50 మెగాపిక్సెల్ ఐ ఏఎఫ్ కెమేరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది.
మే 13న చైనాలో లాంచ్ కానున్న Vivo X100 Ultra, Vivo X100S, Vivo X100S Pro ఫోన్స్ ద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం నమోదవుతోందని కంపెన అంచనా వేస్తోంది. ఎందుకంటే 16జీబీ ర్యామ్‌తో, 200 మెగాపిక్సెల్ కెమేరాతో, 1 టీబీ వరకూ స్టోరేజ్ సామర్ధ్యం కలిగిన ఫోన్లకు కచ్చితంగా మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇండియాలో ఎప్పుడు లాంచ్ అనేది ఇంకా తెలియలేదు.
Also read: Oppo Reno 12 Pro: ఒప్పో నుంచి కొత్తగా 4 కెమేరాలు, 16జీబీ ర్యామ్‌తో పవర్‌ఫుల్ ఫోన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook