Drop Vivo V29E 5G Price: ప్రస్తుతం చాలామంది శక్తివంతమైన కెమెరాలతో కూడిన 5G స్మార్ట్ ఫోన్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా మెగాపిక్సెల్ అధికంగా ఉండే స్మార్ట్ ఫోన్‌లనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా వివో రియల్ మీ కంపెనీలు అతి తక్కువ ధరలోనే ప్రీమియం కెమెరాలతో కలిగిన స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల వివో కంపెనీ విడుదల చేసిన ఓ మొబైల్‌కి మార్కెట్లో మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఏంటో? దానికి సంబంధించిన వివరాలు ఏంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన Vivo V29e 5G స్మార్ట్‌ఫోన్ పర్ఫామెన్స్ ఏంటో అందరికీ తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ 8GB + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మార్కెట్ లో లభిస్తోంది. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఈ స్మార్ట్‌ఫోన్ MRP కంటే చాలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ MRP రూ. 33,999 కాగా.. ప్రత్యేక సేల్‌లో భాగంగా 14% తగ్గింపుతో రూ. 28,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దీని కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ అధికారిక వెబ్సైట్ ని సందర్శించాల్సి ఉంటుంది.


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  


ఈ స్మార్ట్ ఫోన్ పై  ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది.  అయితే ఈ ఆఫర్ నువ్వు వినియోగించుకోవాలనుకునేవారు ముందుగా పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 22,900 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ బోనస్ అనేది మీ పాత స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో పాటు కండిషన్ పైన ఆధారపడి ఉంటుంది. దీంతో మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ పోను ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 6,099 కంటే తక్కువ ధరలోనే పొందవచ్చు. అయితే బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఈ మొబైల్ ను కొనుగోలు చేసే వారికి 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.


ఫీచర్స్‌, స్పెసిఫికేషన్‌లు:
 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే
 2400x1080 పిక్సెల్ రిజల్యూషన్‌
120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌
స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్‌
64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌
5000mAh బ్యాటరీ 
44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
 Funtouch OS 13 గ్లోబల్ OS


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook