Vivo Y200 Price: Vivo నుంచి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న Vivo Y200 5G స్మార్ట్ ఫోన్‌ విడుదల కాబోతోంది. కంపెనీ ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే వెల్లడించబోతోంది. అయితే ఈ మొబైల్‌ విడుదల కాకముందే కొన్ని ఫీచర్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ ఇంతక ముందు విడుదల చేసిన Y సిరీర్‌కు సక్సెసర్‌గా రాబోతోందని తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే 91 మొబైల్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. Vivo Y200 5G పెద్ద కెమెరా కటౌట్‌తో అనేక రకాల కొత్త కొత్త ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా మొబైల్‌ రెండు వేరియంట్స్‌లను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్ ఫోన్‌ డెసర్ట్ గోల్డ్, జంగిల్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


లీకైన వివరాల ప్రకారం..ఈ మొబైల్‌ వెనక భాగంలో రెండు కెమెరా మాడ్యూల్స్‌ను కలిగి ఉంటుంది.  Vivo Y200 5G స్మార్ట్‌ ఫోన్‌ LED ఫ్లాష్‌తో పాటు ఆరా లైట్‌ను కలిగి ఉంటుంది. ఇక ముందు ప్యానెల్‌ విషయానికొస్తే.. మూడు వైపులా సన్నని బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే ఫ్రంట్ టాప్ సెంటర్‌లో పంచ్-హోల్ డిస్‌ప్లేను కూడా అందించబోతోంది. భారత్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ రూ. 24,000లోపే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. 


ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
120Hz రిఫ్రెష్ రేట్‌ డిస్‌ప్లే
స్లిమ్ డిజైన్‌
7.69 మిమీ ఫ్రేమ్
8 జీబీ ర్యామ్‌
Qualcomm Snapdragon 4 Gen 1 చిప్‌సెట్‌
64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌
4800mAh బ్యాటరీ
 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్
ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్
Funtouch OS 13


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..