Vi Prepaid Plan Offers: దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు ఎప్పటికప్పుడు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఉన్నకస్టమర్లను నిలబెట్టుకోవడం, కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడమే ఈ ప్లాన్స్ ప్రధాన ఉద్దేశ్యం. అందుకే దాదాపు అన్ని కంపెనీలు వివిధ రకాల ప్లాన్స్‌తో ఓటీటీ సేవలు ఉచితంగా అందిస్తుంటాయి. ఈసారి వోడాఫోన్ ఐడియా అలాంటి ఆఫరే ప్రకటించింది. ఈ ఆఫర్‌లో వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఒక ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం అంతా ఓటీటీలదే క్రేజ్ నడుస్తోంది. నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, సోనీలివ్ వంటి ఓటీటీలు సబ్‌స్క్రిప్షన్ కూడా పెంచేస్తున్నాయి. అదే సమయంలో టెలీకం కంపెనీలు తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్లాన్స్‌తో ఓటీటీ సేవలు ఉచితంగా అందిస్తున్నాయి. అయితే కొన్ని ఎంపిక చేసిన ప్రీ పెయిడ్ ప్లాన్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంటుంది. ఇప్పుడు వోడాఫోన్ ఐడియా సైతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది సభ్యత్వం ఉచితంగా అందించే ప్లాన్ ప్రకటించింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్ ఉచితంగా ఇవ్వడమే కాకుండా వోడాఫోన్ ఐడియా మూవీస్, టీవీ యాప్ యాక్సెస్ ఉంటుంది. ఇక అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకూ అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. 


వీఐ 601 రూపాయల ప్లాన్


ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుంటుంది. కానీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్ ఏడాది పాటు ఉచితంగా అందుతుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 3 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఇది కాకుండా 16 జీబీ బోనస్ డేటా కూడా ఉంటుంది. 


వీఐ 901 రూపాయల ప్లాన్


ఈ ప్లాన్‌లో వ్యాలిడిటీ 70 రోజులుంటుంది. రోజుకు 3 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. 48 జీబీ బోనస్ డేటా కూడా ఉంటుంది. కానీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆఫర్ వర్తించదు.


వీఐ 1066 రూపాయల ప్లాన్


ఈ ప్లాన్ 84 రోజులకు వర్తిస్తుంది. ఇందులో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రోజుకు 2 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. 


వీఐ 3099 రూపాయల ప్లాన్


వోడాఫోన్ ఐడియా ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా ఉంటుంది. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ప్లాన్. ఇందులో కూడా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. బోనస్ డేటా, ఓటీటీ సేవలు లభించవు.


Also read: PPF Benefits: పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్, నెలకు 5 వేలతో 26 లక్షలు పొందే అవకాశం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook