Whatsapp Hidden Tips Tricks 2023 In Telugu: ప్రస్తుతం వాట్సాప్ వినియోగం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్మార్ట్ ఫోన్‌లోనే కాదు.. కీప్యాడ్ మొబైల్స్‌లోనూ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. చాటింగ్, ఆడియో, వీడియో కాలింగ్, ఫైల్స్ సెండ్ చేసుకోవడం, వీడియోలు షేర్ చేయడానికి ఇలా అనేక రకాలుగా వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. సమాచారాన్ని పంపించుకోవడానికి కోట్లాది మంది వాట్సాప్‌నే యూజ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌తో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది వాట్సాప్. వాట్సాప్‌లో చాలామందికి తెలియని కొన్ని ట్రిక్స్‌ ఉన్నాయి. వీటి గురించి తెలిస్తే.. మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవేంటో చూద్దాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెక్ట్స్‌ను బోల్డ్‌గా మార్చేయండి ఇలా.. 


వాట్సాప్‌లో చాటింగ్ చేసే సమయంలో కొందరు తమ టెక్ట్స్‌ను బోల్డ్‌గా లేదా ఇటాలిక్ స్టైల్‌లో మార్చడం మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. అయితే ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా..? సింపుల్ మీరు కూడా టెక్ట్స్‌ను డిఫరెంట్‌గా సెండ్ చేయవచ్చు. టెక్ట్స్‌ను బోల్డ్ చేయడానికి.. పదానికి ముందు.. చివర స్టార్ (*)ను యాడ్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకు *Hello*. ఇటాలిక్ టెక్ట్స్‌ రావాలంటే.. పదానికి అండర్ స్కోర్ (_)ని రెండు వైపులా యాడ్ చేయాలి. ఉదాహరణకు _Hello_. పదాలపైనా లైన్ కావాలంటే.. రెండు వైపులా ~ చిహ్నాన్ని ఉపయోగించండి. Ex. ~Hello~.


డేటా చెకింగ్..


మీరు మొబైల్ యూజ్ చేసే సమయంలో "మీ డేటా 50 శాతం వినియోగించారు.. కాసేటికే 90 శాతం వినియోగించారు.. ఈ రోజు మీ కోటా డేటా అయిపోయింది.." అంటూ మెసెజ్‌లు రావాడం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు డేటా వేగంగా అయిపోతుంది. మీకు డేటా వినియోగం గురించి సమాచారం కావాలంటే.. వాట్సాప్‌లో ఈజీగా చెక్ చేసుకోండి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజీ, డేటాతో కూడిన ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీరు నెట్‌వర్క్ ఉపయోగాలపై క్లిక్ చేయాలి. మెసేజింగ్, ఫోటోలు, వీడియోలు, వాయిస్ కాల్‌లలో వినియోగించే మొత్తం డేటా గురించి సమాచారం తెలుసుకోవచ్చు. 


Also Read:  IND vs AUS WTC Final 2023: నేడే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌.. రోహిత్ సేన కప్ కొట్టేనా..?   


తెలియకుండా మెసేజ్‌లు చదివేయండి ఇలా..


వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ పంపిస్తే.. అవతలి వ్యక్తి చదివితే బ్లూటిక్ వస్తుంది. మనం కొంతమందికి మెసేజ్‌ పంపించినా.. రెండు టిక్ మార్క్‌లు వస్తాయి గానీ బ్లూటిక్ రాదు. మనం పంపినా మెసేజ్ చదవినా.. మనకు బ్లూటిక్ కనిపించకుండా వాళ్లు సెట్టింగ్‌లో ఆప్షన్‌లో మార్చుకుని ఉంటారు. మీరు కూడా అవతలి వాళ్లు పంపిన మెసేజ్ తెలియకుండా చదవాలంటే.. సెట్టింగ్స్‌లో మార్చేయండి. సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత ప్రైవసీ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రీడ్ రిసిప్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకుంటే.. అవతలి వ్యక్తుల మెసేజ్ చదివినా బ్లూటిక్ కనిపించదు. 


Also Read:  Shubman Gill Dating: మరో భామతో శుభ్‌మన్ గిల్ రొమాంటిక్ డేటింగ్.. నెట్టింట వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook