WhatsApp  Introduced New Feature: మనలో చాలా మంది వాట్సాప్ మెసెజ్ లతోనే నిద్రలేస్తారు. అంతలా మన లైఫ్ స్టైల్లో భాగమైపోయింది ఈ వాట్సాప్. ఏదైనా ముఖ్యమైన విషయం ఇతరులతో పంచుకోవాలన్నా, ప్రేమికులు లవ్ ప్రపోజ్ చేసుకోవాలన్నా, పెళ్లి కబుర్లు చెప్పాలన్నా, ఫన్నీగా మాట్లాడుకోవాలన్నా.. అందరికీ ముందుగా గుర్తుచ్చొది వాట్సాప్ నే. ఈ చిన్న మెసెజింగ్ యాప్ తక్కువ టైంలోనే మనందరితోనూ కలిసిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు దీనిని వినియోగిస్తున్నారు. ఇందులో ఆడియో పంపించాలన్నా, వీడియో కాల్స్ మాట్లాడాలన్నా, మనీ ట్రాన్సఫర్ చేయాలన్నా అన్నీ వాట్సాప్ లోనే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెల్లారి లేచి నుంచి నిద్రపోయే వరకు చాలా మంది వాట్సాప్ లోనే కాలం వెల్లదీస్తున్నారు. యూజర్లకు బోర్ కొట్టకుండా ఉండటానికి తరుచూ ఏదో ఒక అప్ డేట్ ను ఇస్తూనే ఉంటుంది వాట్సాప్.  వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చాంది. అదే చాట్ ఫిల్టర్. అయితే  ఇది పూర్తిగా ఇంకా అందుబాటులోకి రాలేదు. ట్రయల్ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు. యూజర్లకు ఇది మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని వాట్సాప్ చెబుతోంది.


అందుబాటులో ట్రయల్ వెర్షన్..
WaBetaInfo నివేదిక ప్రకారం, ఇప్పటి వరకు ఈ ఫీచర్ కొంతమందికి మాత్రమే ట్రయల్ వెర్షన్ లో అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో అందరూ ఈ ఫీచర్ పొందుతారు. వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో కొంత మందికి మాత్రమే ఈ చాట్ ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని సహాయంతో మీరు సులభంగా చాట్ చేయవచ్చు. ఈ ఫీచర్ ప్రత్యేకత ఏంటంటే.. మీరు చూడని లేదా చదవని సందేశాలను లేదా గ్రూప్ చాట్‌లను మాత్రమే చూపిస్తుంది. 


Also Read: Viral Video today: ఎలా వస్తాయమ్మా మీకు ఇలాంటి ఐడియాలు.. ఇస్త్రీ ఇలా కూడా చేస్తారా..


ఈ ఫీచర్‌ ఎలా ఉపయోగించాలంటే..
మీరు ఇంకా ఈ ఫిల్టర్‌ని చూడకపోతే... మీరు వాట్సాప్‌లోని సెర్చ్ బార్‌కు వెళ్లి మీకు ఏది కావాలో దానిని అక్కడ టైప్ చేస్తే చాలు..వాట్సాప్ దానికి సంబంధించిన అన్ని చాట్‌లను చూపుతుంది. పాత చాట్‌లను కనుగొనడంలో ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఈ కొత్త చాట్ ఫిల్టర్ యూజర్లు తమ చాట్‌లను సులభంగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. త్వరలోనే ఈ ఫీచర్ అందరికి అందుబాటులోకి రానుంది. 


Also Read: Paytm Services: మార్చ్ 15 తరువాత పేటీఎంలో ఏ సేవలు పనిచేస్తాయి, ఏవి పనిచేయవు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook