WhatsApp Channels Feature: వాట్సాప్ ఛానెల్స్.. వాట్సాప్ నుండి మరో సరికొత్త విప్లవాత్మక ఫీచర్
WhatsApp Channels Feature Uses and How it works: టెక్నాలజీ ఇన్నోవేషన్‌లో వాట్సాప్ మరో ముందడుగేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది యూజర్స్‌ని సొంతం చేసుకుని వారి జీవితాల్లో ఒక భాగమైన వాట్సాప్ తాజాగా వాట్సాప్ ఛానెల్ పేరిట మరో అడ్వాన్స్‌డ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
WhatsApp Channels Feature Uses and How it works: టెక్నాలజీ ఇన్నోవేషన్‌లో వాట్సాప్ మరో ముందడుగేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది యూజర్స్‌ని సొంతం చేసుకుని వారి జీవితాల్లో ఒక భాగమైన వాట్సాప్ తాజాగా వాట్సాప్ ఛానెల్ పేరిట మరో అడ్వాన్స్‌డ్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో 150 దేశాల్లో ఈ వాట్సాప్ ఛానెల్ ఫీచర్‌ని లాంచే చేస్తున్నట్టు వాట్సాప్ పేరెంట్ కంపెనీ అయిన మెటా సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించాడు. వాట్సాప్ వినియోగదారుల గోప్యతకు భంగం కలగకుండానే వారికి ఇష్టమైన వ్యక్తులు, సంస్థల నుండి లేటెస్ట్ అప్‌డేట్స్ పొందడానికి ఈ సరికొత్త వాట్సాప్ ఛానెల్ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది అని మార్క్ జుకర్ బర్గ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు.
ఈ సరికొత్త వాట్సాప్ ఛానెల్స్ ఫీచర్ ద్వారా ప్రభుత్వాధినేతలు, సంస్థలు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్, క్రీడాకారులు, సాహీతివేత్తలు, బిజినెస్‌మేన్.. ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎవరైనా , ఏ అంశంపైనైనా తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది వన్-వే బ్రాడ్‌కాస్ట్ టూల్‌గా పనిచేస్తుందన్నమాట. ఇప్పటికే అక్షయ్ కుమార్, విజయ్ దేవరకొండ, కత్రినా కైఫ్, దిల్జిత్ దోసాంజ్, నేహా కక్కర్ వంటి కొంతమంది ప్రముఖులు తమ సొంత వాట్సాప్ ఛానెల్స్ ఉపయోగించడం మొదలుపెట్టారు. ఫేస్‌బుక్ మార్క్ జుకర్‌బర్గ్ సైతం వాట్సాప్ ఛానెల్ ఫీచర్‌ని ఉపయోగించడం మొదలుపెడుతూనే ఈ ఫీచర్ కి సంబంధించిన వివరాలను ప్రపంచానికి పరిచయం చేశాడు.
వాట్సాప్ ఛానెల్ ఫీచర్ కోసం వాట్సాప్‌లో స్టేటస్ ట్యాబ్ తరహాలోనే అప్‌డేట్స్ పేరిట ఓ కొత్త ట్యాబ్ కనిపించనుంది. వాట్సాప్ సైతం తమ కంపెనీకి సంబంధించిన కొత్త ఫీచర్స్, ప్రోడక్ట్స్ గురించి సమాచారాన్ని వాట్సాప్ యూజర్స్‌తో షేర్ చేసుకునేందుకు అధికిరంగా వాట్సాప్ ఛానెల్‌ని ప్రారంభించింది. ఈ ఛానెల్ ద్వారా వాట్సాప్‌కి సంబంధించిన అప్‌డేట్స్ నేరుగా వాట్సాప్ యూజర్స్‌కి చేరనున్నాయి.
ఇది కూడా చదవండి : PM Modi To Host Dinner Party: ఢిల్లీ పోలీసులకు ప్రధాని మోదీ డిన్నర్ పార్టీ
వాట్సాప్ ఛానెల్స్ అడ్మినిస్ట్రేటర్స్, ఫాలోవర్స్ గోప్యత దెబ్బతినకుండా టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు షేర్ చేసుకోవడంతో పాటు పోల్స్ నిర్వహించుకునే వీలు కల్పిస్తుంది. సెలబ్రిటీలు తాము చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా తమ ఫాలోవర్స్‌కి, గ్రూప్స్‌కి వాట్సాప్ ఛానెల్ ద్వారా చెప్పేందుకు వీలు కలుగుతుంది. అంటే సెలబ్రిటీలకు, జనానికి మధ్య వారధిగా ఉంటూ వస్తోన్న ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల తరహాలోనే వాట్సాప్ ఛానెల్ కూడా కీలక పాత్ర పోషించనుంది. ఏదేమైనా మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించిన ఈ ఫీచర్ అనతికాలంలోనే పాపులర్ అవడం ఖాయం అనేలా వాట్సాప్ ఛానెల్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : Red Wine Flowing In Streets: కంపెనీలో స్టోరేజ్ ట్యాంకులు పగిలి రోడ్లపై పొంగిపొర్లిన రెడ్ వైన్.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి