WhatsApp Links Scams: వాట్సాప్‌లో లింక్.. క్లిక్ చేయగానే 17 లక్షలు హాంఫట్..

Do's And Don'ts For Whatsapp Users: ఇలాంటి హ్యాకర్స్ బారినపడి వాట్సాప్ యూజర్స్ మోసపోకుండా ఉండేందుకు వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తూ భద్రతా చర్యలు తీసుకుంటోంది. అయితే వాట్సాప్ వైపు నుంచే కాకుండా జనం కూడా తమ వైపు నుంచి కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి మోసాల బారినపడటం ఆగదు. అందుకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాట్సాప్ యూజర్స్ మోసపోకుండా ఉంటారో వివరించే ప్రయత్నమే ఈ వార్తా కథనం.

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2023, 08:28 PM IST
WhatsApp Links Scams: వాట్సాప్‌లో లింక్.. క్లిక్ చేయగానే 17 లక్షలు హాంఫట్..

WhatsApp Links Scams: ఇటీవల కాలంలో వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు వాయిస్ కాల్స్, మెసేజెస్ చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న సంఖ్య అధికం అవుతోంది. దేశం నలుమూలలా ఎంతో మంది తమకు తెలియకుండానే వాట్సాప్‌లో వచ్చిన లింక్స్‌పై క్లిక్ చేసి సైబర్ క్రిమినల్స్ చేతిలో మోసపోయి లక్షల రూపాయల్లో తమ బ్యాంక్ ఖాతాలు గుల్ల చేసుకుంటున్నారు. ఇటీవల చండీఘడ్‌కి చెందిన ఓ వ్యక్తి కూడా ఇలాగే వాట్సాప్ మెసేజులో వచ్చిన లింకుపై క్లిక్ చేసి సైబర్ మోసం బారినపడ్డాడు. లింకుపై క్లిక్ చేయడంతోనే హ్యాకర్స్ అతడి ఫోన్‌ని హ్యాకింగ్ చేసి అతడి బ్యాంకు ఖాతాలోంచి రూ. 17 లక్షలు దోచేశారు. 

ట్వూ స్టెప్ వెరిఫికేషన్
ట్వూ స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ అనేది రెండంచెల భద్రతా వ్యవస్థ లాంటిది. ట్వూ స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ ఆన్ చేసినట్టయితే.. ఎవరైనా హ్యాకర్స్ మీ వాట్సాప్ ఖాతాని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు 6 అంకెల పిన్‌ని అడుగుతుంది. తద్వారా అపరిచితులు మీ ఖాతాను యాక్సిస్ చేయలేరు. 

అనుమానాస్పద వ్యక్తులను బ్లాక్ చేసి, వారి గురించి వాట్సాప్‌కి రిపోర్ట్ చేయండి
మీ వివరాలు, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వివరాలు అడుగుతూ కొత్త నెంబర్ల నుంచి మీకు ఏవైనా సందేశాలు వచ్చినప్పుడు తొందరపడి అడుగేయొద్దు. ఆ వ్యక్తులను లేదా సంస్థను నేరుగా సంప్రదించి వారి ఐడెంటిటీని ధృవీకరించుకోండి. అప్పటికీ అనుమానం వస్తే.. వారిని వాట్సాప్‌లో బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి.

ప్రైవసీ సెట్టింగ్స్ అడ్జస్ట్ చేసుకోండి
కొత్త కొత్త గ్రూప్స్‌లో చేరే విషయంలో ఎవరెవరు మిమ్మల్ని గ్రూప్స్‌కి యాడ్ చేయవచ్చు అనే అధారిటీ ఇచ్చే స్వేచ్చ వాట్సాప్ యూజర్లకి ఉంటుంది. ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఏదైనా గ్రూప్ చాట్స్ లో అనుమానాస్పదంగా ఏవైనా కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా అనిపిస్తే మీరే వాట్సాప్ కి రిపోర్ట్ చేయవచ్చు.

మీ డీటేల్స్ చూసే వారి వివరాలు తెలుసుకునేలా ప్రైవసీ సెట్టింగ్స్
మీ ప్రొఫైల్ ఫోటోను, మీ ఆన్‌లైన్ స్టేటస్‌ని ఎవరు వీక్షిస్తున్నారో తెలుసుకునేలా ప్రైవసీ సెట్టింగ్స్ సెట్ చేసుకోవచ్చు. మీ కాంటాక్ట్స్ లో ఎవరు మీ వివరాలు చూడొచ్చు, ఎవరు చూడకూడదు అనేది మీరే సెట్ చేసుకోవచ్చు. అనుమానిత వ్యక్తులను ముందుగానే అవాయిడ్ చేయడం ద్వారా వారి ఉచ్చులో పడకుండా ఉండే అవకాశం ఉంటుంది.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x