Whatsapp New Feature: వాట్సప్ AI ఫోటో ఎడిటింగ్ ఫీచర్, ఎలా పనిచేస్తుందంటే
Whatsapp New Feature: బెస్ట్ సోషల్ మెస్సేజింగ్ యాప్‌గా ఉన్న వాట్సప్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందిస్తుంటుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ఫీచర్ ఏంటి, ఎలా పనిచేస్తుందనేది తెలుసుకుందాం.
Whatsapp New Feature: వాట్సప్‌లో ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తుంటాయి. యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు ఈ ఫీచర్లు ఉపయోగపడుతుంటాయి. ఇందులో భాగంగానే కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పవర్ ఎడిటింగ్ టూల్ అందిస్తోంది. త్వరలో AI ఫోటో ఎడిటర్ ఫీచర్ ప్రవేశపెట్టనుంది.
WABetainfo అందిస్తున్న వివరాల ప్రకారం ఆండ్రాయిడ్ 2.24.7.13 అప్‌డేట్ చేసినప్పుడు వాట్సప్ బీటా ఏఐ పవర్డ్ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. స్క్రీన్ ఎడమవైపు ఎగువ భాగంలో గ్రీన్ గుర్తుతో సింబల్ ఉంటుంది. ఈ సింబల్ క్లిక్ చేస్తే మూడు ఆప్షన్లు కన్పిస్తాయి. బ్యాక్ డ్రాప్, రీ స్టైల్, ఎక్స్‌ప్యాండ్. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. దాంతో అన్ని ఫోన్లలో అందుబాటులో ఉండకపోవచ్చు. కచ్చితంగా పనితీరు ఎలా ఉందనేది కూడా తెలియదు. ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్‌డేట్ చేసుకోవాలి. మెటా ఏఐను కస్టమర్లు ప్రశ్నలు అడగవచ్చు. మెటా ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకోవచ్చు. చాట్ జీపీటీతో పోటీ పడేలా మెటా ఏఐ ఉంటుంది.
వాట్సప్ ఏఐ ఫోటో ఎడిట్ ఫీచర్ సహాయంతో ఇమేజ్ బ్యాక్ గ్రౌండ్ క్లియర్ చేసేందుకు లేదా మెరుగుపర్చేందుుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇమేజ్ రీ స్టైల్ చేసేందుకు దోహదపడుతుంది. ఇమేజ్ ఎక్స్‌ప్యాండ్ కూడా చేసుకోవచ్చు. మెటా అందించే సేవల గురించి వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా అభివృద్ది దశలో ఉంది. సాధారణ వినియయోగదారులందరరికీ ఈ ఫీచర్ అందుబాటులో వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింట్లోనూ ఒకే విధమైన ఫీచర్ కలిగి ఉంటుంది.
Also read: iPhone 14 Offers: ఐఫోన్ 14 ప్లస్‌పై ఊహించని డిస్కౌంట్, కేవలం 44 వేలకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook